
చట్టసభల్లో ఎక్కువ శాతం బీసీలు ఉండాలన్నదే బిఎస్పి నినాదం..
తెలంగాణలో రానున్నది బహుజన రాజ్యం..
పయనించే సూర్యడు: మార్చి:15; ములుగు జిల్లా వాజేడు మండల ప్రతినిధి రామ్మూర్తి.ఎ.
వాజేడు:ములుగు జిల్లా వాజేడు మండలం లోని మురుమూరు గ్రామపంచాయతీ పరిధిలోగల కొప్పుసూరు గ్రామంలో బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు కాన్సీరాం జయంతి వేడుకలు మండల ప్రధాన కార్యదర్శి జనగం కేశవరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈయొక్క కార్యక్రమానికి విచ్చేసిన మండల ఈసీ మెంబర్ కుమ్మరి సరబాబు పలువురు మహిళలను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జనగం కేశవరావు మాట్లాడుతూ, బిజెపి ఒక్కటై అంబేద్కర్ ఆశయాలను ఆలోచన విధానాన్ని ప్రక్కన పెడుతున్న అగ్రవర్ణ పార్టీల విధానానికి అనేక ఉద్యమాలు నిర్వహించారని అన్నారు. అత్యంత అతిపెద్దదైన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో బహుజన్ సమాజ్ పార్టీని స్థాపించి కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు సుమారు 100 సైకిళ్లతో యాత్రచేసి ఇంటింటికి వెళ్లి సైకిల్ బెల్ కొట్టి బహుజన వాదాన్ని ఏనుగు గుర్తును పరిచయం చేసిన అపర భగీరధుడు మాన్యవర్ కాన్షిరాం అని కొనియాడారు.మాయావతి అనే ఒక మహిళను నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా గెలిపించిన గొప్ప చరిత్ర మాన్యశ్రీ కాన్షిరం ది అని అన్నారు. రానున్న రోజుల్లో రాజకీయాలు అన్ని బహుజన వాదం చుట్టే తిరుగుతాయని తెలిపారు. బహుజన్ సమాజ్ పార్టీ ఏనుగు గుర్తుపై పోటీ చేసిన ప్రతి వ్యక్తికి పంచాయితీ ఆఫీసు నుండి పార్లమెంటు వరకు గెలుపు ఖాయమని కేశవరావు అన్నారు. ఈ కార్యక్రమంలో కావిరి ముత్తయ్య, జనగం మానస,కుమ్మరి గౌరీదేవి,.. సునీల్,అనిల్. సాకేత్.మోక్షిత శ్రీ తదితరులు పాల్గొన్నారు.