
పయనించే సూర్యుడు మార్చి 2 మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి:శ్రీశైలం ఎడమ గట్టు కాలువ స్వరంగం ప్రమాదంలో సహాయక చర్యలు తొమ్మిద వ రోజు కొనసాగుతున్నాయి భారీగా పేరుకుపోయిన బురద నుంచి మృతదేహా లను సహాయ బృందాలు బయటకు తీస్తున్నాయి.ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు టన్నెల్ ప్రమాదస్థల ప్రాంతానికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి జూపల్లి కృష్ణారావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తో కలిసి సీఎం రేవంత్ రెడ్డి అక్కడకు చేరుకొనున్నారు.ప్రమాద స్థలాన్ని స్వయంగా పరిశీలించడంతో పాటు సహాయక చర్యలను పర్యవేక్షించనున్నారు సీఎం పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ రేంజ్ ఐజీ సత్యనారాయణ నేతృ త్వంలో భారీ భద్రత ఏర్పాటు చేసే పనిలో పడ్డారు