
పయనం చే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్
నిజాంబాద్ జిల్లా
ఈరోజు శనివారం రోజున బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ముత్యాల సునీల్ కుమార్ ఆధ్వర్యంలో పి సి సి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ని ఆయన నివాసంలో కలిసిన భీమ్గల్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు భీంగల్ మండలంలోని నిర్మిస్తున్నటువంటి 100 పడకల హాస్పిటల్ మిగిలిన పనులను మరియు వెజ్ అండ్ నాన్ వెజ్ మిగిలిన పనులను త్వరగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులో తేవాలని మరియు ఆర్ ఓ ఆఫీసు, రిజిస్ట్రేషన్ ఆఫీసు,అగ్రికల్చర్ ఆఫీసు, ఎంఈఓ ఆఫీస్,డిగ్రీ కాలేజ్, గెస్ట్ హౌస్,నూతనంగా సాంక్షన్ అయినటువంటి కోర్టుకు,ముచ్కర్ సొసైటీ భవనం మరియు రహత్ నగర్ లో గోదాములు నూతన భవనాలు మంజూరు చేయించాలని తెలపడం జరిగింది దీనికి సానుకూలంగా స్పందించి వెంటనే డిప్యూటీ సీఎం&హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనర్సింహ కి మరియు ఆర్ అండ్ బి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి మరియు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కి, మరియు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ కి ఫోన్లో మాట్లాడగా వారు సానుకూలంగా స్పందించి మిగిలిన పనులను పూర్తి చేస్తామని నూతన భవనాలు మంజూరు ఇస్తామని తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు బొదిరి స్వామి, పట్టణ అధ్యక్షులు జేజే నరసయ్య మాజీ ఎంపీపీ కన్నె సురేందర్,జిల్లా ప్రధాన కార్యదర్శి కుంట రమేష్, కార్యదర్శి భోజ గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లెల లక్ష్మణ్,ముచ్కర్ సొసైటీ చైర్మన్ బంగ్లా దేవేందర్, పిట్ల శీను,రావుల ఏఎంసి డైరెక్టర్ జీవన్, భీంగల్ విలేజ్ కమిటీ అధ్యక్షులు నీలం రవి,సిహెచ్ రాకేష్,శ్రీధర్ గౌడ్,ఎస్పీ రత్నం, పల్లె శేఖర్,కొరడి లింబాద్రి,బీసీ అధ్యక్షులు రాజు,నల్లూరి శ్రీను, భూమేష్ తదితరులు పాల్గొన్నారు
