
పయనించే సూర్యుడు మార్చి 10 (ఆత్మకూరు నియోజకవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
చేజర్ల మండలంలోని టిడిపి మండల అధ్యక్షుడు రావి లక్ష్మీ నరసారెడ్డి ఆహ్వానం మేరకు చేజర్లలో నిర్వహించిన నూతన గృహప్రవేశ కార్యక్రమంలో సోమశిల ప్రాజెక్టు చైర్మన్ వేలూరు కేశవ చౌదరి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలియజేసి,కుటుంబం ఆనందంగా,సమృద్ధిగా జీవించాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రావి పెంచల రెడ్డి. ముస్లిం మైనార్టీ మండల నాయకులు షేక్ సిరాజుద్దిన్. ఎంపీటీసీ షేక్ మస్తాన్. ఎస్సి సెల్ నాయకుడు సోమవరపు హజరత్తయ్య. పలువురు టిడిపి నేతలు,గ్రామస్తులు పాల్గొన్నారు.