
గజమాలతో మంత్రికి స్వాగతం పలికిన కాంగ్రెస్ నాయకులు
హారతిచ్చి స్వాగతం పలికిన మహిళలు
పయనించే సూర్యుడుఆగష్టు 18(పొనకంటి ఉపేందర్ రావు )
సోమవారం టేకులపల్లి మండలంలో పర్యటించిన తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ & గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు పొంగలేటి శ్రీనివాస్ రెడ్డి ,ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకయ్య, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్,మరియు భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ లు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. శంకుస్థాపనలు చేసేందుకు వచ్చిన మంత్రికి ముత్యాలంపాడు క్రాస్ రోడ్ నందు కాంగ్రెస్ కార్యకర్తలు భారీ గజమాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి పలు గ్రామపంచాయతీలలో రాంపురం,తడికలపూడి, పెట్రాం చెలక, కిష్టారం, పర్యటించి గ్రామాల్లో నూతన బ్రిడ్జి, బీటి రోడ్డు లకు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గ్రామాలకు వచ్చిన మంత్రికి మహిళలు హరతులతో, పూల వర్షంతో, ఘన స్వాగతం తెలిపారు. డీజే, బ్యాండ్, టపాసుల మోతలతో భారీ జన సంద్రంతో గ్రామాలలో పండగ వాతావరణం నెలకొన్నది గ్రామంలో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తునటువంటి కోరిక నేడు నెరవేరిందంటూ ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి, ఎమ్మెల్యేలు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజా ప్రభుత్వం అని గత ప్రభుత్వాలు యనటువంటి అన్ని కార్యక్రమాలు, ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ప్రజల అభిమానాన్ని పొందుతుందని, వారు గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో
ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరం సురేందర్, ఎంపీడీవో బి.మల్లేశ్వరి, మండల తహసిల్దార్ వీరభద్రం, డి.ఎస్.పి చంద్రభాను , మార్కెట్ చైర్మన్ రాంబాబు , సి. ఐ బత్తుల సత్యనారాయణ , ఎస్. ఐ రాజేందర్,బోడు ఎస్ ఐ శ్రీకాంత్ , మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.