
ఇల్లందు డీఎస్పీ చంద్రభాను
పయనించే సూర్యుడుఆగష్టు 22 (పొనకంటి ఉపేందర్ రావు )
టేకులపల్లి :భద్రాద్రి కొత్తగూడెం టేకులపల్లిమండలంలోని వెంకట్యాతండా సమీపంలో రోడ్డు వద్ద వావానాలు తనిఖీలు చేస్తుండగా సీసీఎస్, టేకులపల్లి పోలిసులు సంయుక్తంగా గురువారం సాయంత్రం రూ.2కోట్ల12లక్షల 47వేల గల 424.950 కేజీల గంజాయిని లారీలో తరలిస్తుండగా పట్టుకున్నారు. ఇల్లందు డీఎస్పీ చంద్రభాను తెలిపిన వివరాల ప్రకారం….గంజాయిని కొనుగోలు చేసి ఒడిస్సా నుంచి భద్రాచలం, పాల్వంచ మీదుగా రాజస్థాన్ తరలిస్తుండగా గురువారం సిసిఎస్, టేకులపల్లి పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా లారీలో( RJ06GC0833 )క్యాబిన్ల, సీట్ల కింద, లోడ్ చేశారు. ఒడిస్సా నుంచి రాజస్థాన్ తరలిస్తున్న వారిలో ప్రభులాల్ గుర్జర్,శివరాజ్ గుర్జర్, దొరకగా..రాంబాబు, నారాయణ గుర్జర్ పరారీ లో ఉన్నారు. వీరిని పట్టుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ప్రెస్ మీట్ టేకులపల్లి సిఐ బత్తుల సత్యనారాయణ, టేకులపల్లి ఎస్సై రాజేందర్, బోడ్ ఎస్ఐ శ్రీకాంత్, సి.సి.ఎస్. సిబ్బంది సిఐ రమాకాంత్, ఎస్సీ ప్రవీణ్ పాల్గొన్నారు. వీరిని ఇల్లందు డిఎస్పి చంద్రబాను అభినందించారు.