
పయనించే సూర్యుడు మార్చి8 అన్నమయ్య జిల్లా టి సుండుపల్లి మండలం అన్నమయ్య జిల్లా కేంద్రంలో పర్యటన భాగంగా విచ్చేసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని సుండుపల్లి టిడిపి నాయకులు శివరాం నాయుడు, ఎక్స్ ఎంపీటీసీ బాబు నాయుడు, మండల టిడిపి నాయకులు సురేష్ నాయుడు మస్తాన్ బాబు లు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం రాయచోటి నుండి సుండుపల్లి వరకు జరుగుతున్న డబుల్ రోడ్డు నిర్మాణం అర్ధరాంతరంగం నిలిచిపోయిందని ఎంతోమంది వాహనదారులు ప్రమాదం దుర్మరణం చెందుతున్నారని వెంటనే నిర్మాణ పనులను చేపట్టాలని, మండల ప్రజలను రోడ్డు ప్రమాదాల నుండి కాపాడాలని అర్జీని సమర్పించారు. వెంటనే స్పందించిన ఇంచార్జ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెంటనే ఆరాధిసి సంబంధిత అధికారులకు వెంటనే డబుల్ రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు.