
పయనించే సూర్యుడు బాపట్ల మార్చి 11:- రిపోర్టర్ (కే శివకృష్ణ )
డాక్టర్ ఎన్టీఆర్ వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల బాపట్ల వారి ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ ప్రత్యేక సేవా శిబిరం చివరి రోజు రైతులకు ఆధునిక వ్యవసాయ యంత్ర పరికరాల ప్రదర్శన మీద కార్యక్రమం. ఈనెల 4వ తేదీ నుంచి ఈరోజు వరకు వారం రోజులు ప్రత్యేక సేవా శిబిరం నిర్వహించటం జరిగినది. ఈ కార్యక్రమం చివరి రోజు అయిన రేటూరు అప్పాపురం గ్రామ రైతులకు ఆధునిక వ్యవసాయ యంత్ర పరికరాలపై అవగాహన కల్పించడం జరిగినది. తరువాత ఎన్ఎస్ఎస్ ప్రత్యేక సేవా శిబిరం ముగింపు కార్యక్రమం అప్పాపురం గ్రామంలో నిర్వహించడం జరిగింది. ముగింపు కార్యక్రమానికి ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ గుంటూరు డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్ డాక్టర్ జి కరుణాసాగర్ గారు ముఖ్యఅతిథిగా హాజరవ్వగా కళాశాల అసోసియేటె డీన్ డాక్టర్ డి డి స్మిత్ అధ్యక్షత వహించారు. డాక్టర్ జి కరుణాసాగర్ గారు మాట్లాడుతూ విద్యార్థులందరూ కూడా ఈ వారం రోజులు రేటూరు అప్పాపురం గ్రామాలలో చేసిన సేవా కార్యక్రమాలను తెలుసుకొని విద్యార్థులను అభినందించారు మీరు చేసిన వివిధ కార్యక్రమాలను చూసిన ఈ ఊరి విద్యార్థులు కూడా ఇక మీద ఈ విధముగానే అనుసరిస్తారని భావిస్తున్నాను. విద్యార్థులందరూ కూడా భవిష్యత్తులో చక్కగా స్థిరపడి దేశంలోని రైతులకు ఉపయోగపడే కొత్త కొత్త యంత్రాలు వ్యవసాయానికి ఉపయోగపడే విధముగా చేయాలని అలాగే వ్యవసాయంలో ఆర్ట్ అఫీషియల్ ఇంటిలిజెన్స్ కూడా వృద్ధి చేయాలని కోరారు. కళాశాలలో తయారుచేసిన వ్యవసాయ పనిముట్లను అప్పాపురం గ్రామంలో స్టాల్ నిర్వహించి రైతులకు అమ్మడం జరిగినది. ముఖ్య అతిధి Dr.G. కరుణ సాగర్ ఆటలు వ్యాస రచన క్విజ్ పోటీలలో గెలిపొందిన రేటూరు అప్పపురం పాఠశాల విద్యార్థులకు బహుమతులు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీ పి బాల రాజ్ కుమార్ గారు డైరెక్టర్ అండ్ సీఈవో గ్రామ వికాస్ పేస్ ఫౌండేషన్ బాపట్, వ్యవసాయ కళాశాల బాపట్ల అసోసియేటె డీన్ డాక్టర్ పి ప్రసూనారాణి, అప్పాపురం గ్రామపంచాయతీ కార్యదర్శి శ్రీ ఏ శ్రీనివాసరావు, రేటూరి ఉన్నత పాఠశాల అధ్యాపకులు శ్రీ చెన్నకేశవరావు, అప్పాపురం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ పి వెంకటేశ్వరరావు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్, వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.