
పయనించే సూర్యడు // ఏప్రిల్ // 15 // కుమార్ యాదవ్ // హుజురాబాద్ ( ఆర్ సి )
డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ సైదాపూర్ మండల శాఖ నూతన కార్యవర్గ ఎన్నికలు ఇటీవల జరిగాయి. ఈ సందర్భంగా సైదాపూర్ మండల శాఖ ఎన్నిక కోసం ఎన్నికల పరిశీలకులుగా బొంగానీ రమేశ్ రాష్ట్ర కౌన్సిలర్, వోడ్నాల రాంకిరణ్ రాష్ట్ర కౌన్సిలర్ లు వ్యవహరించారు. అలాగే వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ..ప్రభుత్వం వెంటనే పెండింగ్ ఏరియర్స్ ఇస్తూ, పి ఆర్ సి అమలు చేయాలని, ట్రెజరీలలో పెండింగ్ బిల్స్ క్లియర్ చేయాలని కోరారు. అనంతరం సైదాపూర్ మండల శాఖకు నూతన కమిటీని ఎన్నుకున్నట్లు ప్రకటించారు. అధ్యక్షుడుగా ఎం. సదాశివ్ ఎల్ ఎఫ్ఎల్ హెచ్ఎం పిఎస్ అమ్మనగుర్తి, ఉపాధ్యక్షులుగా టీ సత్యనారాయణ ఎస్ ఏ ( జడ్.పి.హెచ్.ఎస్ ఎక్లాస్పూర్, పి ప్రతిమ ఎస్ ఏ (పీడీ) జెడ్ పి ఐ టి ఎస్ వెంకెపల్లి, ప్రధాన కార్యదర్శిగా బి తిరుపతిరెడ్డి ఎస్ ఏ ( జడ్.పి.హెచ్.ఎస్ దుద్దెనపల్లి, కార్యదర్శులుగా కే గిరిధర్ ) జడ్.పి.హెచ్.ఎస్ వెంకెపల్లి, కే వెంకటరమణ గొల్లగూడెం, ఆడిట్ కమిటీ కన్వీనర్ భాగ్యలక్ష్మి, దుద్దెనపల్లి, జిల్లా కౌన్సిలర్స్ సభ్యులు, అజయ్ కుమార్, దుద్దెనపల్లి, బాంగాని రమేశ్ రాయికల్, వాడ్నీల రాంకిరణ్ వెంకెపల్లి, బుర్రు శ్రీనివాస్ ఎక్లాస్పూర్ లు ఎన్నికైనట్లు రామ్ కిరణ్, రమేష్ లు ప్రకటించారు. కాగా సదాశివ్, తిరుపతి రెడ్డి ఎన్నిక పట్ల పలు ఉపాధ్యాయులు, డిటిఎఫ్ నాయకులు హర్షం వ్యక్తం చేసి అభినందనలు తెలిపారు.
