
ప్రతి బలోపేతమే లక్ష్యంగా డీసీసీ అధ్యక్షుల ఎంపిక
( పయనించే సూర్యుడు అక్టోబర్ 11 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
జనగామ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జనగామ డీసీసీ అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ లో భాగంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో షాద్ నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ వీర్లపల్లి శంకర్ పాల్గొన్నారు. ఈ ప్రెస్ మీట్ లో డీసీసీ ఎన్నికల అబ్జర్వర్, ఒడిశా రాష్ట్రానికి చెందిన దుబాసిస్ పట్నాయక్, పీసీసీ కోఆర్డినేటర్లు శ్రీకాంత్ యాదవ్, ఎండీ.ఆవేజ్,జువ్వాడి ఇందిరా రావు,ప్రస్తుత జనగాం జిల్లా డీసీసీ అధ్యక్షులు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి, జనగాం జిల్లా ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ సంస్థాగత పునర్నిర్మాణంలో భాగంగా డీసీసీ అధ్యక్షులను నియామక ప్రక్రియ ప్రారంభిస్తున్నాం అని తెలిపారు. పార్టీ బలోపేతం కోసం పాటుపడే వ్యక్తికి మద్దతు ఇవ్వాలని కోరారు.అలాగే డీసీసీ ఎంపిక ప్రక్రియలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ,నాయకులు సహకరించాలని కోరారు. డీసీసీ అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ లో భాగంగా జిల్లాలో ఉన్న 3 నియోజకవర్గాల్లో ఉన్న నాయకులను, కార్యకర్తలను కలిసి వారి యొక్క అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు.నాయకుల,కార్యకర్తలనాయొక్క అభిప్రాయాలను అధిష్టానానికి పంపి పార్టీ బలోపేతం కోసం పాటుపడే వ్యక్తిని డీసీసీ పదవికి సిఫారసు చేస్తామని అన్నారు. దుబాసిస్ పట్నాయక్ మాట్లాడుతూ…అభ్యర్థి ఎంపిక ప్రక్రియలో అందరి అభిప్రాయలను పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు. ఈ ఎంపిక ప్రక్రియలో ప్రతి కార్యకర్త,నాయకులు పాల్గొని సహకరించాలని కోరారు.
