
పయనించే సూర్యుడు, జనవరి 21,బూర్గంపాడు మండల రిపోర్టర్ పోతుగంటి రామ్ ప్రసాద్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలం, సారపాక మసీదు రోడ్ లో నివసిస్తున్న పి .పరదేశి రెడ్డి అనే కార్మికుడు తెల్లవారుజామున అకాల మరణం చెందారు.ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొడుకు ఇంటి నుండి వెళ్లిపోయి ఆచూకీ లేని నేపథ్యంలో తన కూతురు సంతోష్ లక్ష్మి తండ్రికి తనే తలకొరివి పెట్టింది. వేస్ట్ పేపర్ యాడ్ లో కార్మికుడు పనిచేస్తున్న కార్మికులందరూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కొడుకు లేనందున కూతురే తండ్రి దహన సంస్కారాలు నిర్వహించింది.