
కుటుంబ సభ్యులకు అప్పగించిన సీఐ గంగాధర్
పయనించే సూర్యుడు ఏప్రిల్ 7 (ఆత్మకూరు నియోజకవర్గ ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
ఆత్మకూరు పోలీస్ సర్కిల్ 24 గంటల్లోనే అమ్మాయి ఆచూకీ కనుగొన్న సిఐ ఏఎస్ పేట మండలం రాజవోలు గ్రామంనికి చెందిన డిగ్రీ విద్యార్థిని కిడ్నాప్ గురైనట్టు 40 రోజుల క్రితం ఫిర్యాదు చేసిన విషయమై ఏఎస్ పేట పోలీసులు స్పందించడం లేదంటూ శనివారం విద్యార్థిని కుటుంబ సభ్యులు బంధువులు గ్రామస్తులు డిఎస్పి కార్యాలయం వద్దకు రాగా వెంటనే స్పందించిన ఆత్మకూరు సిఐ జి.గంగాధర్ కేసు వివరాలు తెలుసుకొని అమ్మాయి ఆచూకీ కనుగొంటానని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చి ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రత్యేక బృందంతో గాలింపు చేపట్టి 24 గంటల్లోనే ఆ అమ్మాయి ఆచూకీ కలుగుని సోమవారం కుటుంబ సభ్యులకు అమ్మాయిని అప్పగించారు. అమ్మాయి ఆచూకీ కనుగొని మీకు అప్పజెప్పుతానని మాట ఇచ్చిన 24 గంటల్లోనే సిఐ గంగాధర్ మాట నిలుపుకోవడంతో సిఐ గారికి ధన్యవాదాలు తెలిపిన బాలిక కుటుంబ సభ్యులు బంధుమిత్రులు.నూతన టెక్నాలజీతో హైదరాబాద్ నగరంలో వీరు ఉన్న సమాచారాన్ని తెలుసుకున్న సీఐ గంగాధర్ గాలింపు చేపట్టిన ప్రత్యేక బృందంతో ఆ అమ్మాయిని అమ్మాయిని తీసుకొని వెళ్ళిన అబ్బాయిని అక్కడి నుండి ఆత్మకూరు స్టేషన్ కు తీసుకొని వచ్చి వివరాలు నమోదు చేసుకున్నారు.ఏఎస్ పేట మండల తాహసిల్దార్ ఎదుట వీరిని ప్రవేశపెట్టి తాహసిల్దార్ అనుమతితో అమ్మాయిని కుటుంబ సభ్యులకు అప్పగించిన ఏఎస్ పేట పోలీసులు. డిగ్రీ విద్యార్థిని ఆచూకీ కోసం 40 రోజులు అయిన విషయమై కుటుంబ సభ్యుల ఆందోళనకు తెరదించుతూ కుటుంబ సభ్యులకు బాలికను అప్పగించి కధ సుఖాంతం చేసిన సీఐ గంగాధర్. అమ్మాయి తల్లిదండ్రులు అభినందించారు