పయనించే సూర్యుడు జనవరి 11 (ఆత్మకూరు నియోజకవర్గ ప్రతినిధి)
చేజర్ల మండలంలోని తూర్పు కంభంపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమీపంలో ఏ ఎస్ ఎన్ క్రికెట్ టోర్నమెంట్ ను శనివారం ప్రారంభించారు. గ్రామ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీపీ అన్నలూరు శ్రీనివాస్ లు నాయుడు కొమ్మి రమేష్ నాయుడు ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ను చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ టోర్నమెంట్ మండలంలోని అన్ని గ్రామాల నుండి అలాగే జిల్లా స్థాయిలో కూడా పాల్గొనాలని కోరారు. మొదటి బహుమతి 30 వేల రూపాయలు అన్నలూరు శ్రీనివాస్ లు నాయుడు విరాళంగా విజేతలకు అందజేయనున్నారు. అలాగే రెండో బహుమతి కొమ్మి రమేష్ నాయుడు 15000 రూపాయలను విరాళంగా విజేతలకు ఇవ్వనున్నారు.టోర్నమెంట్ లో పాల్గొనేందుకు ఆసక్తి కలిగిన వారు ఎంట్రీ ఫీజు వెయ్యి రూపాయలు చెల్లించాలన్నారు. ఈ టోర్నమెంట్ కుకార్యనిర్వాహకులుగా మారెళ్ళ శివ పెండెం విజయకుమార్ ఉన్నారు