
పయనించే సూర్యుడు న్యూస్ నారాయణపేట జిల్లా 11 తేదీ ఏప్రిల్ శ్రీనివాస్
నారాయణపేట జిల్లా కేంద్రంలో ప్రగతి శీల మహిళా సంఘం (POW ) ఐద్వా మహిళా సంఘం, ఆధ్వర్యంలో అంబేద్కర్ భవన్ లో తెలంగాణ రాష్ట్రంలో జరిగే 72వ మిస్ వరల్డ్ పోటీలను రద్దు చేయాలని రౌండ్ టేబుల్ సమావేశం ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత ప్రగతిశీల మహిళ సంఘం పి ఓ డబ్ల్యు జిల్లా అధ్యక్షురాలు శారద, ఐద్వా మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు రాజేశ్వరి అధ్యక్షత వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య వత్తగా వచ్చినటువంటి పిఓడబ్ల్యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి జయలక్ష్మి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదులో మే 7 నుండి 31 వరకు జరిగే మిస్ వరల్డ్ అందాల పోటీలు జరుగుతున్నాయి ఈ అందాల పోటీలకు 120 దేశాల నుండి మహిళ ప్రతినిధులు పాల్గొంటున్నారు ఇది గర్వించదగిన విషయం కాదు అంతకంటే కాదు ప్రజలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం కెసిఆర్ బాటల్లోనే నడుస్తున్నారు కెసిఆర్ ప్రభుత్వం ఏడు లక్షల 71 వేల కోట్ల అప్పు అలాగే రేవంత్ రెడ్డి ప్రభుత్వం 15 నెల కాలంలో ఒక్క లక్ష 50 వేల కోట్ల మొత్తం కలిసి ఎనిమిది లక్షల 24 వేల కోట్ల అప్పు చేశారు. అంటే రెండు లక్షల పదహారువేల రూపాయలు తలసరి అప్పు మోస్తున్నాం, పైగా ఈ అందాల పోటీలకు ప్రభుత్వం వందల కోట్లు ఖర్చు పెడుతుంది ప్రజలకు ఎంత మాత్రం అవసరము లేని మరింత భారం పెంచే ఈ అందాల పోటీలు నిర్వహించడం అవసరమా, 2024 లో మిస్ వరల్డ్ అందాల పోటీలు ముంబైలో జరిగినవి మళ్లీ 2025 మిస్ వరల్డ్ పోటీలను తెలంగాణలో నిర్వహించడం కోసం దుబాయ్ తో పోటీపడి లాక్కుంది అంటే నీకంటే నేను రాష్ట్రాన్ని బహుళ జాతి కంపెనీలకు తాకట్టు పెడతానని రాష్ట్రాలు దేశాలు పోటీ పడుతున్నాయి. అందంగా ఉంటే ఆత్మవిశ్వాసం గుర్తింపు వస్తాయని అదే వ్యక్తిత్వం అని అందాల పోటీలు ఇప్పటికే ప్రచారం చేశాయి వీటి ప్రభావంతో అమ్మాయిలే కాదు అన్ని వయసుల వారు అందంగా ఉండాలని కోరుకుంటున్నారు అందాల పోటీలు మెట్రోపాలిటన్ సిటీలు, నగరాలు, పట్టణాలు కాలేజీల వరకు వ్యాపించాయి. ఈ విష సంస్కృతికి వ్యతిరేకంగా మహిళలు ప్రజలు ప్రజాస్వామిక వాదులు వ్యతిరేకించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పి ఓ డబ్ల్యు జిల్లా కార్యదర్శి సౌజన్య, ఐద్వా మహిళా సంఘం జిల్లా కార్యదర్శి సామ్రాన్, పి ఓ డబ్ల్యు జిల్లా ఉపాధ్యక్షురాలు లక్ష్మి, జిల్లా కోశాధికారి మాధవ జిల్లా నాయకులు సావిత్రమ్మ, సుజాత, టి యు సి ఐ జిల్లా కార్యదర్శి బి.నరసింహ, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ టౌన్ కార్యదర్శి కెంచ నారాయణ, రైతు సంఘం జిల్లా కార్యదర్శి అంజిలయ్య గౌడ్, పి డి ఎస్ యు రాష్ట్ర సహాయ కార్యదర్శి సంధ్య ,ఏఐపీకేఎంఎస్ జిల్లా కార్యదర్శి ప్రశాంత్, అరుణోదయ జిల్లా అధ్యక్షులు రాములు, ఏఐపీకే యూఎస్ జిల్లా నాయకులు నారాయణ, పి డి ఎస్ యు జిల్లా సహా కార్యదర్శి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు
