
తరతరాల నాటి నుంచి మహిళలను ప్రత్యేకంగా గౌరవించే సంస్కృతి మనది
తెలంగాణ సంప్రదాయానికి ప్రతిబింబంగా నాటి సీఎం కేసీఆర్ ప్రతి మహిళకు బతుకమ్మ చీరను అందించారు
మాజీ ఎమ్మెల్యే వై.అంజయ్య యాదవ్
కొండారెడ్డిపల్లి గ్రామంలో బీఆర్ఎస్ నాయకుడు ప్రేమ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్
( పయనించే సూర్యుడు సెప్టెంబర్ 22 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ నిలువెత్తు నిదర్శనం అని మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. సోమవారం కొండారెడ్డిపల్లి గ్రామంలో గ్రామ నాయకుడు ప్రేమ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో బతుకమ్మ పర్వదినాన్ని పురస్కరించుకొని గ్రామ మహిళలకు ఉచితంగా బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన అనంతరం మాట్లాడారు. తరతరాల నాటి నుంచి మన తెలంగాణ ప్రాంతాల మహిళలకు ప్రత్యేకంగా గౌరవించుకోవడం మన సంప్రదాయం, మన గౌరవానికి సూచిక అని, ముఖ్యంగా బోనాలు, బతుకమ్మ పర్వదినాలలో మహిళలను ఆరాధిస్తూ బోనం రూపంలో, బతుకమ్మ రూపంలో పూజలు చేస్తామని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర పర్వదినాలలో ముఖ్యమైన దసరా పండుగ రోజు తెలంగాణ ఆడపడుచులంతా సంతోషంగా బతుకమ్మ సంబరాలను జరుపుకోవాలని ఆకాంక్షతో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి ఆడపరచుకు ఉచితంగా బతుకమ్మ చీరలు అందజేశారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరమే మన ప్రాంత పర్వదినాలకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని అన్నారు. ఎక్కడైతే మహిళలు సంతోషంగా, స్వేచ్ఛగా ఉంటారో ఆ ప్రాంతంలో లక్ష్మీ కళకళలాడుతుందని, దేవతలు సంచరిస్తారనే నానుడి ఉందని గుర్తు చేశారు. గ్రామ మహిళల సంతోషం కోసం ప్రేమ్ కుమార్ గౌడ్ సొంత ఖర్చులతో బతుకమ్మ చీరలను ఉచితంగా అందజేయడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వంకాయల నారాయణరెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ ఈట గణేష్, మాజీ జడ్పీటీసీ నర్సింగరావు, మాజీ వైస్ చైర్మన్ లక్ష్మీనారాయణ గౌడ్, కేశంపేట్ మాజీ సర్పంచ్ వెంకటట్ రెడ్డి, శ్రీశైలం గౌడ్ మండల పార్టీ అధ్యక్షులు మురళీధర్ రెడ్డి, కొత్తపేట మాజీ సర్పంచ్ నవీన్ కుమార్, పాపిరెడ్డి కూడా మాజీ సర్పంచ్ లక్ష్మీనారాయణ, ఇప్పలపల్లి మాజీ సర్పంచ్ తోట ఆంజనేయులు, అల్వాల సర్పంచ్ శ్రీలత శ్రీనివాస్, సీనియర్ నాయకులు వాజిద్, మాజీ కో ఆప్షన్ నెంబర్ జమాల్ ఖాన్, పీఎసిఎస్ చైర్మన్ జగదీశ్వర్ గౌడ్, సింగిల్ విండో వైస్ చైర్మన్ పి. అంజిరెడ్డి, మాజీ ఎంపిటిసిలు బాలరాజ్, నవీన్ వెంకటేష్, దశరథం, యాదయ్య, శ్రీను, రాజు, రామ్ రెడ్డి, కంచుకోట బాలరాజు తదితరులు మరియు గ్రామ నాయకులు ప్రేమ్ కుమార్ గౌడ్ మిత్ర బృందం ఉదయ్ కుమార్, దశరథం, అరవింద్, శేఖర్, రామకృష్ణారెడ్డి ,శ్రీశైలం, లింగం, రాములు, ఆసిఫ్ , శ్రీశైలం యాదవ్, శ్రీకాంత్ గౌడ్, కర్ణాకర్ ,ఆగం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
