
*బి.ఎస్.పి నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీనివాసులు
*దళిత రణభేరిని జయప్రదం చేయండి
పయనించే సూర్యుడు సెప్టెంబర్ 14 న్యూస్ శింగనమల ప్రభుత్వాలు పాలకులు మారుతున్న దళితులపై దాడులు ఆగలేదని వీటిని నిరసిస్తూ బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో దళిత రణభేరి సభను జయప్రదం చేయాలని, శింగనమలమండల కేంద్రంలో బిఎస్పి నియోజకవర్గ ఇన్చార్జ్, జిల్లా అడ్వైజర్ కమిటీ సభ్యుడు బి శ్రీనివాసులు, శింగనమల నియోజకవర్గం ఇన్చార్జి రమేష్ లు గోడ పత్రికలను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రభుత్వాలు పాలకులు మారుతున్నా,నేటి కంప్యూటర్ యుగంలో కూడా దళితులపై దాడులు ఆగలేదని, కుల వివక్ష అంటరానితనం కూకటి వేళ్ళతో పెకలించాలని, దళిత సామాజిక వర్గం ఏకమై వివక్షను, అంటరానితనాన్ని ఎదిరించాలన్నారు, రెండు అధికార కులాల మధ్య నలిగిపోతున్న దళితులు ఒకరు పోతే ఒకరు చొక్కాలు మార్చుకున్నట్లుగా అధికారాన్ని మార్చుకుంటూ తమ అధికార పీఠాన్ని పదిలపరుచుకుంటున్నారన్నారు. వీరిని ఎదుర్కొనేందుకు మెజార్టీ వర్గమైన దళితులందరం ఏకం కావాలన్నారు. రెండు కులాల అధికార ఉన్మాదానికి సామాన్యులు ముఖ్యంగా బహుజన కులాలు మాల, మాదిగ, గిరిజన, కులాలు ఆహుతవుతున్నారన్నారు. సెప్టెంబర్ 24వ తేదీ విజయవాడలో ధర్నా చౌక్ దగ్గర జరిగే దళిత రణభేరి ధర్నాకు నియోజకవర్గంలోని బహుజన సమాజ్ పార్టీ నాయకులు కార్యకర్తలు, అభిమానులు, మేధావులు, అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు.