పయనించే సూర్యుడు న్యూస్:-11,రామగిరి,సెంటినరీ కాలనీ:-
రామగిరి మండలం సెంటినరీ కాలనీ ప్రాంతంలో నివాసం ఉంటున్న వలస కూలీలకు కార్మిక నాయకుడు చిలువేరు స్వామి తమ సొంత ఖర్చులతో దుప్పట్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత రెండు సంవత్సరములుగ కార్మికులకు తనకు తోచిన విధంగా కొంత సహాయం చేయడం జరుగుతుందన్నారు. పొట్టకూటి కోసం వేరే జిల్లాల నుండి వలస వచ్చిన కార్మికులు సింగరేణి పారిశ్రామిక ప్రాంతంలో సింగరేణి కాంట్రాక్టర్ల వద్ద, తాపీ మేస్త్రి ల వద్ద దినసరి కూలీలుగా పనిచేస్తున్నారన్నారు. చిన్న చిన్న కుటీరాలు ఏర్పాటు చేసుకుని వాటిలో జీవనం సాగిస్తూ ఎండ, వాన,చలికి, ఇబ్బంది పడుతూ ఉండటం వలన నా వంతు సహాయంగా కొంతమందికి దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది అన్నారు. ఇలా చాలామంది కనీస సౌకర్యాలు లేక వలస కార్మికులు ఇబ్బంది పడుతున్నారు అన్నారు. ఈ కార్యక్రమంలో మామిడి కుమార్ తదితరులు పాల్గొన్నారు.