
పయనించే సూర్యుడు సెప్టెంబర్ 20 (సూళ్లూరుపేట మండలం రిపోర్టర్, దాసు) :
దక్షిణాది ప్రసిద్ధిగాంచిన, కాళంగి నది తీరాన వెలసిన శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి దేవస్థానం నందు ఈనెల సెప్టెంబర్ 22వ తేదీ నుండి అక్టోబర్ 02 తేదీ వరకు జరుగుతున్న శరన్నవరాత్రుల మహోత్సవము అత్యంత వైభవంగా జరుగుతుందని, ఈ 11 రోజులు శ్రీ చెంగాళమ్మ అమ్మవారు భక్తులకు 11 రకాల అలంకారముతో దర్శనమిస్తుందని ఆలయ ఈవో తెలియజేశారు.ప్రతి పౌర్ణమి రోజున అమ్మవారి చండీయాగము మరియు ప్రతిరోజు శ్రీ చక్ర కుంకుమార్చన, శ్రీ అమ్మవారి ఊంజల సేవ, శ్రీ అమ్మవారి పల్లకి సేవ, ప్రతిరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని భక్తుల ఎల్లరు శ్రీ చెంగాళమ్మ అమ్మవారిని దర్శించుకుని అమ్మ కృపకు పాత్రులు కాగలరని తెలియజేశారు.