తెలుగు వెలుగు సాహితీ వేదిక ఆధ్వర్యంలో కాళోజీ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వారి సౌజన్యంతో నంది అవార్డు పురస్కారం అందుకున్న కుంగ్ ఫు మాస్టర్ ఎండి అహ్మద్ ఖాన్ (బ్రూస్ లీ )
( పయనించే సూర్యుడు జనవరి 11 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ మెగావత్ నరేందర్ నాయక్ )
తెలుగు వెలుగు సాహితీ వేదిక ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలు 2025 లో భాగంగా తెలుగు వెలుగు నంది పురస్కారాల మహోత్సవం వేదిక శ్రీ త్యాగరాయ గాన సభ హైదరాబాద్ నందు ఘనంగా జరిగాయి. ఈ క్రమంలో కుంగ్ ఫు మార్షల్ ఆర్ట్స్ రంగంలో విశిష్ట కృషి చేసినందుకు తెలుగు వెలుగు నంది పురస్కారం కాళోజీ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వారి సౌజన్యంతో నంది అవార్డును రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ న్యూ పవర్ కుంగ్ ఫు మార్షల్ ఆర్ట్స్ అకాడమీ కోచ్ ఎండి అహ్మద్ ఖాన్ (బ్రూస్ లీ) అందుకున్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ మానవ జన్మ ఎతినందుకు ఎంతో కొంత సార్ధకత ఉండాలి ఏదో సాధించాలి తాను కొందరికైనా మార్గదర్శకంగా ఉండాలి అని ఏ కొందరిలోనో ఆ తపన ఉంటుంది. అలాంటి వారే చరిత్రలో నిలిచి పోతారు అని అన్నారు.అటువంటి ఆణిముత్యం లాంటి అతిరథ మహారథులు హేమహేమీలు తమ ప్రతిభ పాటవాలను నలుగురికి పంచుతూ ఎన్నో అద్భుతాలు సృష్టించాలని ఆకాంక్షిస్తూ ఇలాంటి విజయాలను భవిష్యత్తులో మరెన్నో సాధించాలని ఆకాంక్షించారు.