
పయనించే సూర్యుడు. ఫిబ్రవరి 26. ఖమ్మం జిల్లా బ్యూరో ఇంచార్జ్ గుగులోత్ భావుసింగ్ నాయక్ ఏన్కూరు : ఈనెల 27న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలలో వరంగల్,నల్గొండ,ఖమ్మం ఉపాధ్యాయ నియోజకవర్గంలో ఉపాధ్యాయ,అధ్యాపక సంఘాల ఉమ్మడి అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డికి అత్యధిక మొదటి ప్రాధాన్యత ఓట్లతో గెలిపించాలని టీఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి డిఎస్.నాగేశ్వరరావు కోరారు.నర్సిరెడ్డి గెలిస్తేనే ఓటర్లు గెలిచినట్లని, ఇంకెవరు గెలిచినా వారు వెంటనే అధికార పార్టీ చేరిపోయే అవకాశవాదులేనని, అప్పుడు ఓటర్ ఓడిపోతారని అన్నారు. నర్సిరెడ్డి మాత్రమే గత ఆరేళ్ళుగా నిజమైన ఉపాధ్యాయ ప్రతినిధిగా వ్యవహారిస్తున్నారని అన్నారు. నిత్యం నియోజకవర్గంలో పర్యటిస్తూ విద్యారంగం, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేశారా ని,నర్సిరెడ్డి చొరవతోనే టెట్ నివాదం పరిష్కారమైందని, వేలాది మంది ఉపాధ్యాయులకు బదిలీలు, పదోన్నతలు వచ్చాయని అన్నారు. తనకు మంజూరైన నియోజకవర్గ అభివృద్ది నిధులను 100 శాతం పాఠశాలలు,కళాశాలల అభివృద్ధికి కేటాయించారని, ముఖ్యమంత్రి సహాయనిధి నుండి పేదలకు వైద్య సహాయం కోసం నాలుగున్నర కోట్లు మంజూరీ చేయించారని తెలిపారు.మంగళవారం ఏన్కూర్ మండలంలో పలు పాఠశాలలను డియస్.నాగేశ్వర రావు సందర్శించి ఉపాధ్యాయుల సమస్యలపై మాట్లాడారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తిమ్మరావుపేట పాఠశాలలో బి.రాంచంద్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాడ్లాడుతూ నెల మొదటి తేదీన వేతనాలు ఇస్తామన్న హామీ మోడల్ స్కూల్స్, గురకులాలు,కెజిబివిల్లో అమలు జరగడం లేదన్నారు.రెండేళ్లుగా ఉపాధ్యాయుల సప్లమెంటరీ బిల్లులు, సెలవు జీతాలు, మెడికల్ రీయింబర్స్మెంట్,జిపిఎఫ్, జిఎల్ఐ తదితర బకాయిలు ట్రెజరీలో ఆమోదం పొందినప్పటికీ ఇ-కుబేర్ లో పెండింగ్ లో ఉన్నాయని, రిటైరైన ఉద్యోగుల గ్రాట్యుటీ, కమ్యుటేషన్ తదితర రిటైర్మెంట్ బెనిఫిట్స్ సంవత్సర కాలంగా విడుదల కాకపోవడంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సర్వీసు నిబంధనలు రూపొందించి డిఈఓ,డిప్యూటీ, ఇఒ,డైట్ బిఈడి కళాశాల అధ్యాపకుల పదోన్నతులు చేపట్టాలని,గురుకులాల పనివేళలలను విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అనుకూలంగా శాస్త్రీయంగా నిర్ణయిలించాలని,కెజిబివి ఉద్యోగులకు పేస్కేలు ఇవ్వాలని,010 పద్దు కింద వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి మూడ్ పుల్లయ్య యూటీఎఫ్ నాయకులు నర్సింహారావు, గోపాల్, రవికుమార్, వై.నాగేశ్యరావు, సింగ్యా తదితరులు పాల్గొన్నారు.