Monday, July 14, 2025
Homeఆంధ్రప్రదేశ్నా ఫోన్ ట్యాంపరింగ్ చేయించిన సూత్రధారి ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డినే.వట్టే జానయ్య యాదవ్ ఫైర్

నా ఫోన్ ట్యాంపరింగ్ చేయించిన సూత్రధారి ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డినే.వట్టే జానయ్య యాదవ్ ఫైర్

Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ జులై 13 సూర్యాపేట జిల్లా ప్రతినిధి:

సూర్యాపేట జిల్లా సెంట్రల్ న్యూస్

ఫోన్ ట్యాపింగుకు పాల్పడిన జగదీశ్ రెడ్డి శాసన సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలి.

తనకు సిట్ పై గౌరవం ఉంది అన్నారు

మీడియా తప్పులు ఎత్తిచూపితే దాడులు సంస్కృతి

అభివృద్ధి ముసుగులో వేలకోట్ల రూపాయలు,సంపాదించిన మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి పై ప్రభుత్వం సిట్ అధికారులు చర్యలు తీసుకోవాలి జగదీష్ రెడ్డి నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు నీ అవినీతి బయట పెట్టేంత వరకు పోరాడుతూనే ఉంటాం ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీఎంఎస్ మాజీ చైర్మన్ బీసీ సంఘం రాష్ట్ర సమన్వయకర్త వట్టే జానయ్య యాదవ్ బీసీ బిడ్డలు ఉన్నత స్థాయిలో ఎదగడం జీర్ణించుకోలేక నా ఫోన్ ట్యాపరింగ్ పాల్పుడ్డావు తన ఫోన్ ట్యాపింగ్ చేయించింది ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డినే వట్టే జానయ్య యాదవ్ గాంధీనగర్ తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు దమ్ముంటే జగదీశ్ రెడ్డి సూర్యాపేట వనాజ భవన్ సెంటర్ కు రావాలి బహిరంగ చర్చకు నేను సిద్ధం నువ్వు నేను తెలుసుకుందాం: సిట్ అధికారులు తన ఫోన్ ట్యాంపరింగ్ అయినట్లు గుర్తించి నోటీసులు పంపించిన విషయాన్ని ఆయన మీడియాకు వెల్లడించారు రాష్ట్రంలో తన ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం మరి ఎవరికీ,లేదని ఆయన తెలిపారు తనకు,శత్రుత్వం,మిత్రుత్వం,ఏదైనా జగదీష్ రెడ్డి తోనే అని జానయ్య యాదవ్ స్పష్టం చేశారు.మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కేటీఆర్ లతో తనకు ఎలాంటి శత్రుత్వం,మీత్రుత్వం గానీ లేదని ఆయన పునరుద్ఘాటించారు తెలంగాణ రాజకీయాలను గత కొంతకాలంగా కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సూర్యాపేట లో కొత్త మలుపు తిరిగింది బీసీ నాయకుడు మరియు ప్రజా ఉద్యమకారుడు మాజీ డి.సి.సి చైర్మన్ వట్టే జానయ్య యాదవ్ ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డిపై ఆరోపణలు గుప్పించారు.తన ఫోన్ ట్యాపింగ్ కు కారణం జగదీశ్ రెడ్డే నని ఆయన కుండబద్దలు కొట్టారు. నాకు శత్రుత్వం మిత్రుత్వం గాని ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి తోనే: మీడియా సమావేశంలో వట్టే జానయ్య యాదవ్ మాట్లాడుతూ తన ఫోన్ ట్యాంపరింగ్ కు సంబంధించి సోమవారం14వ తేదీన వచ్చి వాంగ్మూలం ఇవ్వాలని సమాచారం ఇచ్చిందని ఆరోజు అన్ని ఆధారాలతో సిట్ కు తెలియజేస్తానని అన్నారు, నాడు,2023 ఎన్నికల్లో ఓడిపోతానన్న భయంతోనే నా ఫోన్ ట్యాంపరింగ్ కు పాల్పడ్డాడని అంతకుముందు దేశంలో ఎప్పుడు లేని విధంగా నాపై 60 అక్రమ కేసులు నామీద పెట్టించాడని 70 రోజులు నేను అజ్ఞాతవాసంలోకి వెళ్లానని తిరిగి సూర్యాపేటకు వచ్చినప్పుడు సూర్యాపేట ప్రజలు లక్షల కొద్ది తరలివచ్చి నన్ను ఆదరించారు.ఎన్నికల్లో పోటీ చేస్తుండగా నా ప్రతి కదలికను నా అనుచరుల కదలికను ఫోన్ ట్యాపంగ్ చేసుకుంటూ నా ఓటమికి కారణమయ్యాడు.ఇప్పుడు నేను రెండు సంవత్సరాలు అయింది సూర్యాపేట కొచ్చి నామీద పెట్టిన కేసులు బాధితులు ఎటుపోయారు అన్నారు ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి కి సవాల్ విసిరిన వట్టే జానయ్య యాదవ్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డికి వట్టే జానయ్య యాదవ్ ఇప్పటికే బహిరంగ సవాలు విసిరిన విషయం తెలిసిందే:ఆయన గతంలో ప్రకటించారు.ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అయిందని సిట్ అధికారులు నోటీసులు అంశాన్ని వెల్లడించిన నేపథ్యంలో,ఆ సవాల్ మరింత ప్రాధాన్యత సంతరించుకుంది జగదీశ్ రెడ్డి ఎలా స్పందిస్తారనేది వేచి చూడాలి.. తెలంగాణలో ఫోన్ ట్యాంపరింగ్ అధికార పార్టీ కాంగ్రెస్,బీఆర్ఎస్ మధ్య తీవ్ర రాజకీయ వాగ్వాదానికి దారి తీసింది అనేకమంది రాజకీయ నాయకులు వ్యాపారవేతలు జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేయబడ్డాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.సిట్ ప్రత్యేక దర్యాప్తు బృందం,ఈ కేసును దర్యాప్తు చేస్తోంది.ప్రజల వ్యక్తిగత,గోప్యత భద్రతకు సంబంధించిన ఈ సున్నితమైన అంశంపై ప్రభుత్వం పూర్తి పారదర్శకతతో వ్యవహరించాలని ప్రతిపక్షాలు నాయకులు డిమాండ్ చేస్తున్నాయి.ఈ వివాదం రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ అన్నేపర్తి రాజేష్,కుంభం నాగరాజు, వల్లాల సైదులు యాదవ్,కుంభం వెంకన్న,మీర్ అక్బర్,సుంకర బోయిన రాజు,బోల్లె సైదులు,పెద్ద బోయిన జానకి రాములు,ఆవుల అంజయ్య యాదవ్ సూపర్ సైదులు,ఉప్పల మల్లయ్య,కడం పేర్ల చంద్రయ్య,లింగాల సైదులు, ముక్కాల లింగయ్య,వట్యల శేఖర్ ఉపేందర్,చింతకాయల జానయ్య బీసీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments