
//పయనించే సూర్యుడు// ఆగస్టు 4//మక్తల్
నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం భూనిర్వాసితులకు బహిరంగ మార్కెట్ ధర కనుగుణంగా పరిహారం అందివ్వాలని కోరుతూ అంబేద్కర్ చౌక్ లో బస్టాండ్ రోడ్డు మీద ఆదివారం రోజు గంటపాటు రాస్తారోకో నిర్వహించారు.ఈ రాస్తా రోకోలో భూ నిర్వాసితుల సంఘం పుంజనూరు ఆంజనేయులు సి ఆర్ గోవింద్ మాట్లాడుతూ గత 20 రోజులుగా భూ నిర్వాసితులు జిల్లా కేంద్రంలో రీలే దీక్షలు చేస్తున్న జిల్లా కలెక్టరేట్ ముట్టడి చేసిన ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తున్నాదని భూ నిర్వాసితుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు.ప్రభుత్వం ఇట్లానే మొండి వైఖరితో ఉంటే భవిష్యత్తులో భూ నిర్వాసితులు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తారని హెచ్చరించారు.ప్రభుత్వం ఇస్తామన్న ఎకరంకు పరిహారము 14 లక్షల రూపాయలు ఆమోదయోగ్యం కాదని ఆ డబ్బుతో మరో వంక భూమి కొనే పరిస్థితి లేదని అన్నారు.ప్రాజెక్టులకు భూములు ఇస్తున్న భూనిర్వాసితులకు అన్యాయం చేయొద్దని హితవు పలికారు.ప్రాజెక్టు కోసం తమ భూములను అప్పగిస్తున్న రైతులను కన్నీళ్లకు గురి చేయవద్దని వారిని శాశ్వత వలసదారులుగా తయారు చేయొద్దని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు .మార్కెట్ ధర నిర్ణయించెందుకు న్యాయ కమిషన్ ఏర్పాటు చేయాలని బేసిక్ ధర ప్రకారం 2013 షేకరన చట్టాన్ని అమలు చేసి భూ నిర్వాసితులను ఆదుకోవాలని కోరారు.భూనిర్వశితుల జిల్లా కార్యదర్శి కేశవ్ గౌడ్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ అన్ని విధాలుగా వెనుకబడి గురైన నారాయణపేట ప్రాంతానికి నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం మంచిదేనని అయితే అదే స్థాయిలో భూనిర్వశితులకు కూడా ప్రభుత్వం ప్రాధాన్య ఇవ్వాలని భూ నిర్వాసితులను ప్రభుత్వం తన హృదయంలో పెట్టుకొని పూర్తిస్థాయిలో సాయం అందివ్వాలని అందుకు బహిరంగ మార్కెట్ ధరకు అనుగుణంగా వారికి పరిహారం అందించే విధంగా ప్రభుత్వ చర్యలు ఉండాలని డిమాండ్ చేశారు.
ఈ రాస్తారోకో కార్యక్రమంలో భూ నిర్వాసితుల సంఘం కాట్రేపల్లి, కార్చ్వర్ ఎర్నాగుపల్లి గ్రామ నాయకులు నాయకులు ఆంజనేయులు, భూనిర్వసితుల గ్రామ నాయకులు హనుమంతు భూ నిర్వాసితుల సంఘం నాయకులు నరసింహులు, కృష్ణ, మాల గజలప్ప, జిలాని, నారాయణ గౌడ్ సత్యనారాయణ గౌడ్, అంజప్ప, బొంబాయి సోమన్న, అశోక్ గౌడ్, పెద్ద తమ్మ, సోమన్న, రాజు, వెంకట్ రెడ్డి, బుచ్చన్న తదితరులు పాల్గొన్నారు.
