Saturday, September 20, 2025
Homeఆంధ్రప్రదేశ్నిజాంబాద్ జిల్లారోగులకు రిఫరల్ ద్వారా ఆర్.ఎం.పి పి.ఎం.పి లకు ఆసుపత్రుల నుండి వచ్చే కమిషన్లకు చెక్..

నిజాంబాద్ జిల్లారోగులకు రిఫరల్ ద్వారా ఆర్.ఎం.పి పి.ఎం.పి లకు ఆసుపత్రుల నుండి వచ్చే కమిషన్లకు చెక్..

Listen to this article

పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్

జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్యశాఖ అధికారిని తీసుకున్న నిర్ణయాన్ని ప్రజాపంతా స్వాగతం తెలుపుతుంది.. –వి. ప్రభాకర్ సీపీఐ ఎం ఎల్ ప్రజాపంథా మాస్ లైన్ జిల్లా కార్యదర్శి సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజా పంత ఆర్మూర్ నిజాంబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లాల కమిటీ ఆధ్వర్యంలో చికిత్స కోసం ఆస్పత్రులకు ఆర్ఎంపీలు పీఎంపీలు ద్వారా వచ్చే కమిషన్లను బంద్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్యశాఖ అధికారులు విడుదల చేసిన సర్కులర్ ను ప్రజాపంతా అభినందనలు తెలియజేస్తుందని కుమార్ నారాయణ భవన్లో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది..ఈ సందర్భంగా సీపీఐ ఎం ఎల్ మాస్ లైన్ ప్రజాపంథా నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లాల కార్యదర్శి వి ప్రభాకర్.. మాట్లాడుతూ నిజాంబాద్ జిల్లాలో గత 15 నుండి 20 సంవత్సరాలుగా ఆర్ఎంపీలు పీఎంపీలు చేస్తున్న కమిషన్ల దందను బందు చేయాలని దీనికి ప్రోత్సహిస్తున్న ఆసుపత్రుల పైన చర్యలు తీసుకోవాలని అనేక దఫాలుగా ఉద్యమం నిర్వహించడం జరిగిందని వారు అన్నారు. జిల్లా కేంద్రంలో స్కానింగ్ సెంటర్ల నుండి ఆసుపత్రుల వరకు ఆర్ఎంపీ పీఎంపీ, తోపాటు ఆంబులెన్స్ డ్రైవర్లకు కమిషన్లు ఇస్తూ ప్రతి అంశంలో ఆర్ఎంపీలకు వివిధ రకరకాలుగా స్టార్ హోటల్ నుండి సొంతంగా భవనాలు నిర్మించే వరకు సొంత కార్లు ఇప్పించే వరకు మరియు విదేశాలకు విహారయాత్రలకు పంపే స్థాయిలో ముదిరిపోయిందని వారు అన్నారు.గత సంవత్సరం జిల్లా కేంద్రంలోని అయ్యప్ప స్కానింగ్ సెంటర్లో రోగులను లక్ష్యంగా చేసుకుంటూ స్త్రీలను అవమానపరిచే విధంగా వారి అనుమతి లేకుండా వారి చిత్రాలు వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేసిన సందర్భాలను వారు గుర్తు చేశారు.ఇటువంటి స్కానింగ్ సెంటర్ల పైన అధికారులు కొరడ చూపించాలని వారు డిమాండ్ చేశారు.అదే కోణంలో ఆర్ సి నెంబర్ 84/CEA/DMHO NZB DATE 17-09-2025. ఈ సర్కులర్ ను గౌరవ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య శాఖ అధికారి కఠినమైన శాఖపరమైన చర్యలు ఉంటాయని ఇప్పటికైనా ప్రైవేట్ ఆసుపత్రులు పేద మధ్య తరగతి రోగులకు వారికి తగ్గట్టుగా బిల్లు తీసుకోవాలని ఇందులో ఆర్ఎంపీలు పీఎంపీలకు ఏమాత్రం చోటు కల్పిస్తే ఆసుపత్రుల పైన చర్యలు తీసుకుంటామని ఆదేశాలను జారీ చేయడాన్ని ప్రజాపంథా మాస్ లైన్ పార్టీ పూర్తిగా స్వాగతిస్తుందని మరియు జిల్లా కలెక్టర్ కి జిల్లా వైద్యశాఖ అధికారికి అభినందనలు తెలియజేస్తుందని వారు అన్నారు.జిల్లావ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రులలో పర్యవేక్షణ జరపాల్సిన అవసరం ఉందని ఎటువంటి రాజకీయ నాయకుల ప్రలోభాలకు లొంగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని వారు అన్నారు.ఇకనైనా ప్రైవేట్ ఆస్పత్రులు ఈ కల్చర్ను పూర్తిగా బంద్ చేసి పేదవారికి వైద్యం అందే విధంగా చొరవ చూపాలని వారు అన్నారు.కొంతమంది అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రొఫెసర్లు వైద్య వృత్తిలో ఉండి ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలు లేవంటూ ప్రైవేట్ కి వెళ్లాలని సూచించడం సిగ్గుచేటని ఇటువంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని వారు అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్గా తీసుకొని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆసుపత్రుల్లో సమస్యలను పరిష్కారం చేసి సరిపోయే బెడ్లను అందుబాటులో ఉంచి పేదలకు మంచి వైద్యం అందించాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంతా ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి బి దేవారం జిల్లా నాయకులు ఎం ముత్తెన్న ఆర్మూర్ సంయుక్త మండలాల కార్యదర్శి బి కిషన్ నాయకులు శేఖర్ రాజన్న పిడిఎస్యు జిల్లా అధ్యక్షుడు నరేందర్ నజీర్ నిఖిల్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments