
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టీ కే గంగాధర్
ఈ రోజు శుక్రవారం రోజున కాంగ్రెస్ భవన్ నందు ఎన్ఎస్యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణు రాజ్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ మాజీ ప్రభుత్వ ఈరవత్రి అనిల్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వేణు రాజు మాట్లాడుతూ ఈరావత్రి అనిల్ పుట్టినరోజు వేడుకలు కాంగ్రెస్ భవన్ నందు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉంది అని, ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అనిల్ అన్న ఎల్లప్పుడు బడుగు బలహీన ప్రజల కోసం ఆలోచిస్తూ వారి అభివృద్ధి తమ సంతోషంగా భావించి పనిచేసిన నాయకుడని, ఎల్లవేళల కార్యకర్తలకు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సేవ చేసిన నాయకుడని ఆయనను కొనియాడారు. ఈరవత్రి అనిల్ అన్న మరింత ఎత్తుకు ఎదిగి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో సంతోషంగా ఉండాలని ఆ దేవుని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ యు ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి సాయికిరణ్, శివ. హరీష్. అభిలాష్, గణేష్ ,పండు. ధనుషు. తేజ. రవి.రాజు.
మరియు తదితరులు పాల్గొన్నారు.