
ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ రెడ్డి
పాఠశాలకు టాయిలెట్స్ రూములు లేవని ఆవేదన వ్యక్తం చేసిన విద్యార్థులు
సొంతంగా అతి త్వరలో పాఠశాలకు అవసరమైన మౌలిక వసతుల ఏర్పాటు చేయిస్తానని హామీ
( పయనించే సూర్యుడు ఆగస్టు 21 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
విద్యార్థులు ఆరోగ్యకరమైన వాతావరణంలో విద్యాభ్యాసం చేయడం అత్యంత అవసరమని వారికి అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటు చేయడంలో నా వంతు సహాయ సహకారం ఉంటుందని,విద్యార్థుల విద్యా భవిష్యత్తు బలమైన పునాదిల నిలవాలంటే వారికి అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటుతోనే సాధ్యమని ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ రెడ్డి.నిడదవెల్లి పాఠశాల ఉపాధ్యాయుల,విద్యార్థుల ఆహ్వానం మేరకు స్థానిక మండల నాయకులతో కలిసి నిడదవెళ్లి పాఠశాలను సందర్శించారు ఎమ్మెల్సి నవీన్ రెడ్డి.ఈ సందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థులు పాఠశాలలో ఉన్న సమస్యలను ముఖ్యంగా టాయిలెట్స్ రూమ్స్ లేవని వాటి ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ నవీన్ రెడ్డిని కోరారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ నిధులతో సంబంధం లేకుండా తన సొంత నిధులతో పాఠశాలలో ఉన్న టాయిలెట్స్ రూములని అతి త్వరలో పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చారు అంతేకాకుండా పాఠశాలకు ఏరకమైన మౌలిక సమస్యలు ఉన్న తన వద్దకు తీసుకురావాలని పాఠశాల యాజమాన్యానికి సూచించారు.అతి త్వరలో టాయిలెట్స్ రూములని నిర్మాణం పూర్తి చేయిస్తానని విద్యార్థులకు హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ కేశంపేట వైస్ ఎంపీపీ సురేందర్,తొమ్మిది రేకుల మాజీ సర్పంచ్ బాల్ రాజ్ గాడ్, మాజీ ఎంపిటిసి యాదయ్య,మాజీ ఉపసర్పంచ్ రామ్ రెడ్డి,పాపిరెడ్డిగూడ మాజీ సర్పంచ్ తాండ్ర విష్ణువర్ధన్ రెడ్డి,మాజీ ఎంపిటిసి రామచందర్,పోమాల్ పల్లి మాజీ సర్పంచ్ భూపాల్ రెడ్డి,కాకునూర్ మాజీ సర్పంచ్ యారం శేఖర్ రెడ్డి,బిఆర్ఎస్ నాయకులు నాగిళ్ల వెంకటేష్,జయంత్ రెడ్డి,నాగరాజు,ఉమాపతి, పల్లాటి క్రిష్ణయ్య, రామస్వామి,తిరుపతి రెడ్డి,జగన్ రెడ్డి, ఆంజనేయులు,యాదయ్య గౌడ్,క్రిష్ణ, ఫైజాన్, తలసాని ప్రవీణ్ రెడ్డి,రామాంజన్, రజనీకాంత్ గౌడ్, మురళి, తదితరులు పాల్గొన్నారు
