Wednesday, October 22, 2025
Homeఆంధ్రప్రదేశ్నియోజకవర్గ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసిన కార్పొరేటర్ మాధవరం రోజా దేవి రంగారావు

నియోజకవర్గ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసిన కార్పొరేటర్ మాధవరం రోజా దేవి రంగారావు

Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 1 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి శేరిలింగంపల్లి నియోజకవర్గం

ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసిన కార్పొరేటర్ మాధవరం రోజా దేవి రంగారావు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా చివరి రోజు విజయదశమి రోజు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి అవతారంలో దర్శమివ్వనున్నారు. విజయదశమి తెలుగు రాష్ట్రాలలో అతి పెద్ద పండుగ. ఉత్తర భారతంలో కూడా దుర్గా పూజ పేరుతో నవరాత్రులు ఘనంగా జరుగుతాయి. ఈ సందర్భంగా విజయదశమి ఎందుకు జరుపుకుంటాం? దాని వెనుక ఉన్న గాధ ఏమిటి అనే విషయాలను ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.విజయదశమి పండుగ వెనుక ఓ గాథఅపరాజితా దేవి అవతరించిన రోజు విజయదశమి. అపరాజితా దేవి అంటే పరాజయమన్నది ఎరుగని దేవత. త్రిశక్తి స్వరూపమైన ఈ దేవిని పూజిస్తే పరాజయమన్నదే ఉండదు. అమ్మవారు మధు, కైటభులను రాక్షసులను సంహరించి ప్రజలకు సుఖఃశాంతులను అందించినది కూడా ఈ రోజే!విజయాలకు నాంది విజయదశమివిజయదశమి సర్వ విజయాలకు నాంది. ఈ రోజు ఏ పనిని ప్రారంభించినా విజయం తధ్యం. విజయదశమి రోజునే శ్రీరాముడు లోకకంటకుడైన రావణ సంహారం చేసాడు. అందుకే ఈ రోజు ప్రజలు శ్రీరాముని విజయానికి సంకేతంగా రావణ దహనం కూడా చేస్తారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments