Sunday, March 16, 2025
Homeఆంధ్రప్రదేశ్నిరంతర పోరాట స్ఫూర్తితో సాగిన భగత్ సింగ్,రాజగురు,సుఖదేవ్ లు నేటి విద్యార్థి, యువతరానికి ఆదర్శం కావాలి

నిరంతర పోరాట స్ఫూర్తితో సాగిన భగత్ సింగ్,రాజగురు,సుఖదేవ్ లు నేటి విద్యార్థి, యువతరానికి ఆదర్శం కావాలి

Listen to this article

భగత్ సింగ్,రాజగురు, సుఖదేవ్ ల 94వ వర్థంతి సందర్భంగా ముద్రించిన గోడ పత్రికలు ఆవిష్కరణ


పయనించే సూర్యుడు మార్చి 16 టేకులపల్లి రిపోర్టర్ (పొనకంటి ఉపేందర్ రావు )

ఇల్లందుదేశ స్వాతంత్రం కోసం, బ్రిటిష్ ముష్కరులు అమలు చేసిన అనిచివేత,దోపిడి, దౌర్జన్యాలకు,సామ్రాజ్యానికి వ్యతిరేకంగా నిరంతర పోరాట స్ఫూర్తితో సాగిన భగత్ సింగ్ రాజగురు,సుఖదేవులు నేటి విద్యార్థి,యువతరానికి ఆదర్శం కావాలని పివైయల్ రాష్ట్ర కార్యదర్శి వాంకుడోత్ అజయ్, పి డి యస్ యూ రాష్ట్ర అధ్యక్షులు కాంపాటి పృథ్వీ అన్నారు. శనివారం ఇల్లందు పట్టణం చండ్ర కృష్ణమూర్తి ట్రస్ట్ భవన్ లో పివైయల్,పి డి యస్ యూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ల జాయింట్ సమావేశం పివైయల్ జిల్లా అధ్యక్షులు దారావత్ దేవ,పి డి యస్ యూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శి బానోత్ నరేందర్ ల అధ్యక్షతన జరిగింది. సమావేశం అనంతరం భగత్ సింగ్ రాజగురు,సుఖదేవుల 94 వ వర్ధంతి సందర్భంగా ముద్రించిన గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానవ చరిత్ర పుటలు తిరగేస్తే చార్వాకులు, స్పార్టకస్ వంటి ఉజ్వల తారలు ఉన్నతమైన ప్రగతిశీల ప్రయోజనాల కోసం ప్రాణాలర్పించారని, ప్రపంచ స్థాయిలో చేగువేరా,ఫైడల్ కాస్ట్రో లాంటి విప్లవ వీరులు అమెరికన్ సామ్రాజ్యవాదుల కబంధహస్తాల్లో అమరులయ్యారని అదే కోవలో భారత ఉపఖండం లో భగత్ సింగ్,రాజగురు, సుఖదేవ్ లు బ్రిటిష్ సామ్రాజ్యవాదుల చేతిలో ఉరి తీయబడినరని భగత్ సింగ్ తన సహచరులు కలలుగన్న సార్వభౌమాధికారం, లౌకికవాదం,సోషలిజం కోసం పోరాడుతున్న ఎందరికో గొప్ప స్ఫూర్తినిస్తుందని వారు అన్నారు. భారతదేశన్ని పట్టిపీడిస్తున్న సామ్రాజవాదానికి, పెట్టుబడిదారు వ్యవస్థకు, మతోన్మాదం,కులతత్వాలకు వ్యతిరేకంగా భారతీయ విద్యార్థి,యువతరం,ప్రజలు భగత్ సింగ్ స్ఫూర్తితో ఉద్యమించాలని దేశంలో మోడీ ప్రభుత్వం కుహానా దేశభక్తిని బట్టబయలు చేస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అమెరికాలో నివసిస్తున్న భారత ప్రజలపై అనుసరించే దుశ్చర్యలకు వ్యతిరేకంగా భగత్ సింగ్, రాజగురు,సుఖదేవ్ ల 94వ వర్ధంతి సభలను జరుపుకోవాలని వారు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పి వై ఎల్ జిల్లా కార్యదర్శి రామకృష్ణ, పి వై ఎల్ జిల్లా సహాయ కార్యదర్శి మంగయ్య, జిల్లా నాయకులు ఇస్లావత్ కోటేష్ ,పి డి యస్ యూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకులు బి.సాయి, పార్థసారథి, గంగాధర గణేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments