
పయనించేసూర్యుడు జులై 02(పొనకంటి ఉపేందర్ రావు)
ఇల్లందు:ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు తల్లి తండ్రి లేని నిరుపేదవిద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసిన ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకొని అందరి మన్ననలు పొందాలని బావి భారత పౌరులుగా భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉందని గొప్ప చదువులు చదువుకొని దేశానికి సేవలందించాలని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ మండల రాము, పులి సైదులు, డి శివకుమార్, బొల్లా సూర్యం, మడుగు సాంబమూర్తి, చిల్లా శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు