
పయనించే సూర్యుడు న్యూస్// నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం ఇన్చార్జ్ వడ్ల శ్రీనివాస్ మార్చ్ 12 తేదీ
ఎండాకాలం మొదలవుతున్న సందర్భంగా కోటకొండ గ్రామంలో నీటి సమస్య లేకుండా గ్రామ కార్మికులు గ్రామంలో సమస్యలు తలెత్తకుండా ఏప్పటికప్పుడు సమస్యలు తన దృష్టికి తీసుకురావాలని కార్మికులకు సూచించారు కోటకొండ గ్రామపంచాయతీ కార్యదర్శి చాణిక్య రెడ్డి. గ్రామంలోని ముఖ్యమైన కాలనీలో నీటి సమస్యలున్న కొన్ని ప్రాంతాలను పరిశీలించి అది వెంబడే పేరు చేయాలని కార్మికులకు సూచించారు. ప్రజలకు నీటి ఆ సౌకర్యం రాకుండా చూడాలని అన్నారు. అలాగే ప్రజలు కూడా ఎండాకాలం కాబట్టి నీటి ను జాగ్రత్తగా వాడాలని అనవసరంగా నీటిని వృధా చేయొద్దని అన్నారు. అలాగే మిషన్ భగీరథకు సంబంధించిన ఎ సమస్య ఉన్న తన దృష్టికి తీసుకురావాలని అన్నారు.
