


పయనించే సూర్యుడు మార్చి 12 టేకులపల్లి రిపోర్టర్ (పొనకంటి ఉపేందర్ రావు)
టేకులపల్లి ముత్యాలంపాడు క్రాస్ రోడ్లని రైతు వేదికలో వాటర్ ఎండ్ ల్యాండ్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ సెంటర్ ను బుధవారం హైదాబాద్ చే ప్రారంభించారు, వర్షాధారిత ప్రాంతాలలో నేల మరియు నీటి సంరక్షణ పద్దతులు, నీటి కుంటల నిర్మాణము, వరిసాగులో నీటిని ఆదా చేసే పద్దత్రులుపై రైతులకు శిక్షణ ఇవ్వడం జరిగింది. వాలంతరి పరిశోధనా సంస్థ నుండి సుబ్బారావు మాట్లాడుతూ. అధిక వర్షపాతం కురిసినపుడు వర్షపునీటిని నీటికుంట ల ద్వారా సంరక్షించు కోవచ్చును అలాగే డ్రిప్ ఇరిగేషన్ నీటికొరత ఉన్న ప్రదేశాలలోనే కాదు ఎక్కువ నీరు ఉన్నా కూడా నీటిని తగ్గించి డ్రిప్ ద్వారా పంటలు పండించవచ్చునని తెలియజేశారు . వాగుల ద్వారా ప్రవహించే నీటిని చెక్ డ్యాం ల ద్వారా సంరక్షించు. కోవచ్చునని తెలిపారు. అనంతరం కె వి కె కోఆర్డినేటర్ డాక్టర్ లక్ష్మి నారాయణమ్మ టేకులపల్లిలో భిన్న రకాల పంటలు పండించే ఆనావాయితీ ఉందని ఇంకా పంట మార్పిడి చేసుకోవాలని సూచించడం జరిగినది. జిల్లా ఏడిఏ లాల్ చందు, మాట్లాడుతూ ఉపాధి హామి పథకం ద్వారా ప్రతి రైతు బోర్ ప్రక్కన 20మీ పొడవు 20 మీ. వెడల్పుతో నీటి కుంటను తీసి నీటిని రిచార్జి చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో వాలంతరి ఏవో, ఎస్ అన్నపూర్ణ , ఏ ఎం ఓ ఎన్ . అన్నపూర్ణ, ఏ ఈ ఓ లు మరియు రైతులు పాల్గొన్నారు.