
పయనించే సూర్యుడు: మార్చి 15: ములుగు జిల్లా వాజేడు మండల ప్రతినిధి. రామ్మూర్తి. ఎ.
వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలంలోని పలు గ్రామాలకు చెందిన పలువురు సభ్యులు మరియు వెంకటాపురం మండలానికి చెందిన సభ్యులని శనివారం చర్ల మండలంలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయం లో నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈసందర్భగా నూతన కమిటీలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గా చర్ల మండలానికి చెందిన ఇర్ఫ శ్రీను, వైస్ చైర్మన్ గా వాజేడు మండలానికి చెందిన పూనేం రాంబాబు ప్రమాణ స్వీకారం చేశారు. కమిటీ సభ్యులుగా కారం కన్నయ్య, శ్యామల సీత, ఉయిక వేంకటేశ్వర రావు, కారం జోగారావు, బోదెబోయిన చంద్రయ్య, ఆలం సత్యనారాయణ, పొసెట్టి గౌరయ్య, పాయం వెంకట రమణయ్య, పోడియం సింగయ్య, యాలం సాయి, నియమితులయ్యారు. ఈసందర్భంగా వాజేడు మండలం నుండి నూతనంగా వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన పూనెం రాంబాబు మాట్లాడుతూ వ్యవసాయ మార్కెట్ పరిధిలోని రైతులకు ప్రజలకు అన్నివిధాల సౌలభ్యత చేకూరుస్తామని, రైతుల అభివృద్ధికి అన్నివిధాలుగా సహకరిస్తామని తెలియ జేశారు ఈయొక్క కార్యక్రమం లో వాజేడు, నూగూరువెంకటాపురం,చర్ల మండలానికి చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు.
