
పంచాయతీ కార్యదర్శిని సన్మానిస్తున్న దృశ్యం…
రుద్రూర్, ఆగస్టు 07 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి)
రుద్రూర్ మండల గ్రామ పంచాయతీ నూతన కార్యదర్శిగా ప్రేమ్ దాస్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా మండల కాంగ్రెస్ నాయకులు పంచాయతీ కార్యదర్శిని శాలువా, పూల మాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు షేక్ నిస్సార్, వడ్ల నరేష్ తదితరులు పాల్గొన్నారు.