
సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ
“బహుముఖ ప్రజ్ఞాశాలి” విభాగంలో షాద్ నగర్ సీనియర్ జర్నలిస్ట్ ఎండి ఖాజాపాషాకు ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు
జర్నలిస్ట్ కెపికి అవార్డుతో పాటు నగదు పురస్కారం
జర్నలిస్టులకు భాషపై పట్టు ముఖ్యం
ఇతరులకు నష్టం కలిగించే వార్తలను సరిచూసుకోవాలి
జర్నలిస్టు సంఘాలు ఎక్కువయ్యాయి – విలువలు తగ్గాయి
ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారంపై ఆవేదన
విషయ పరిజ్ఞానం లేకుండా వార్తలను ప్రసారం చేయొద్దు
కన్నుల పండుగగా సాగిన ఉత్తమ జర్నలిస్టు అవార్డులు – 2025 ఉగాది పురస్కారాలు
( పయనించే సూర్యుడు ఏప్రిల్ 13 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )
నేను ఒకప్పుడు జర్నలిస్టునే.. మీడియా రంగం గురించి నాకు అనుభవం ఉంది.. మీడియా రంగంలో ఉన్న ఇబ్బందులు ఇతర అంశాల పట్ల అవగాహన ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ అన్నారు. శనివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ కేంద్రంలో గల తుమ్మలపల్లి కళాక్షేత్రంలో తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 2024- 25 సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన సుమారు వందమంది జర్నలిస్టులకు 34 విభాగాల్లో ఉత్తమ జర్నలిస్టు ఉగాది అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ సీనియర్ జర్నలిస్టు వార్త దినపత్రిక పాత్రికేయులు ఎండి ఖాజాపాషా (కేపీ)కు బహుముఖ ప్రజ్ఞాశాలి విభాగంలో 2024- 2025వ సంవత్సరానికి గాను ఉగాది ఉత్తమ జర్నలిస్టు పురస్కారాన్ని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఎన్వి రమణ చేతులో మీదుగా అందుకున్నారు. శాలువాతో సత్కరించి మెమొంటోతో పాటు నగదు పురస్కారాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ మాట్లాడుతూ.. 1980 దశకంలో తను విజయవాడలో తన డిగ్రీ చదువు పూర్తి చేసుకున్నాక పాత్రికేయునిగా పనిచేశానని గుర్తు చేశారు. ఆరోజుల్లో ఓ పదిమంది పాత్రికేయులు మాత్రమే ఉండేవారని, జర్నలిస్టులు కొంత ఆత్మ విమర్శ చేసుకోవాలని, తను నిర్మొహమాటంగా కొన్ని విషయాలను చెబుతానని ఎన్వి రమణ పేర్కొన్నారు. ఇప్పటి పరిస్థితుల్లో లెక్కపెట్టలేనంతమంది జర్నలిస్టులు అయ్యారని అన్నారు. అప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా లేదని ఇప్పుడు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ అదే విధంగా సోషల్ మీడియా ఉన్నాయని పేర్కొన్నారు. జర్నలిస్టులు తక్కువగా ఉన్న సమయంలోనే మీడియా రంగానికి ఎక్కువగా గౌరవం ఉండేదని పేర్కొన్నారు. నేడు ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా రావడంతో వాస్తవాలు తెలుసుకోకుండానే వార్తలు బ్రేకింగ్ న్యూస్ ప్రసారం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టులకు తెలుగు భాష పై పట్టు ప్రధానమని అన్నారు. ప్రస్తుత తరుణంలో జర్నలిజం అనేక విమర్శలు ఎదుర్కొంటుందని వాటిని అధిగమించాలని గుర్తు చేశారు. జర్నలిజం విలువలు తగ్గడానికి కారణం అందరిని అన్నారు. జర్నలిస్టుల మధ్య ఐక్యత లేకపోవడం సంఘాలు పెరగడం వీటికి దారితీస్తుందని తన అభిప్రాయాన్ని ఖరాఖండిగా చెప్పారు. అందరూ ఏకతటిపైకి వచ్చి ఒక సంఘాన్ని పెట్టుకొని అందరికీ బాధ్యతగా గుర్తింపు కార్డులు జారీ చేసి సమస్యలపై ముక్తకంఠంతో పోరాడితే సాధించలేనిది అంటూ ఏమీ లేదని ఎన్వి రమణ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. వార్తలు ఎవరిపైన అయిన రాసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని తమ వార్తల వల్ల ఇతరులకు నష్టం జరుగుతుంది అంటే వారి వివరణ తీసుకోవచ్చని చెప్పారు. ఎవరినైనా ఇంటర్వ్యూ చేసినా, ఇతర విషయాలు రాసినా పూర్తి విషయ పరిజ్ఞానం జర్నలిస్టుకు ఉండాలని సూచించారు. ఉగాది పురస్కారాలను ఉత్తమ జర్నలిస్టులకు అందజేసినందుకు తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం అధ్యక్షులు మేడవరపు రంగనాయకులను తదితర కమిటీని అభినందించారు. ఉత్తమ పురస్కారం అందుకోవడం గర్వంగా ఉంది – షాద్ నగర్ సీనియర్ జర్నలిస్ట్ కేపీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలలో ఉత్తమ జర్నలిస్టులుగా ఎంపికైన వేళ భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ చేతులమీదుగా బహుముఖ ప్రజ్ఞాశాలి ఉత్తమ జర్నలిస్ట్ అవార్డును తీసుకోవడం గర్వకారణంగా ఉందని షాద్ నగర్ సీనియర్ జర్నలిస్ట్ ఎండి ఖాజాపాషా (కేపీ) అన్నారు. న్యాయమూర్తి ఎన్వి రమణ చెప్పిన అనేక విషయాలు ఎంతో గొప్పగా ఉన్నాయని, ఆయన సూచనలు మీడియా రంగానికి అవి ఎంతో మేలు చేసే అంశాలని అన్నారు. ప్రస్తుత తరుణంలో మీడియా రంగం విలువలను ఎంతో చక్కగా ఉదహరించారని పేర్కొన్నారు. ఒక జర్నలిస్టుగా జీవితాన్ని ప్రారంభించి ఆ తర్వాత దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా సేవలు అందించిన ఎన్వి రమణ మీడియాకు ఒక రోల్ మోడల్ అని అన్నారు. ఈ పురస్కారం అందుకోవడం గర్వంగా ఉందని కె.పి పేర్కొన్నారు. తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం కమిటీకి ధన్యవాదాలు తెలిపారు.