Tuesday, March 4, 2025
Homeఆంధ్రప్రదేశ్నైపుణ్య శిక్షణ కార్యక్రమాల అమలుకు పక్కా ప్రణాళిక రూపొందించాలి

నైపుణ్య శిక్షణ కార్యక్రమాల అమలుకు పక్కా ప్రణాళిక రూపొందించాలి

Listen to this article
  • నైపుణ్య శిక్షణ కార్యక్రమాల అమలుకు పక్కా ప్రణాళిక రూపొందించాలి… స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. శ్రీజ
  • వేసవిలో విద్యార్థుల కోసం ప్రత్యేక శిక్షణ కోర్సులు ఏర్పాటు

పయనించే సూర్యుడు. మార్చి 5. ఖమ్మం జిల్లా బ్యూరో ఇంచార్జ్ గుగులోత్ భావుసింగ్ నాయక్

జీవనోపాది, నైపుణ్య సముపార్జన, అవగాహన (సంకల్ప్) కార్యక్రమంపై సంబంధిత అధికారులతో సమీక్షించిన అదనపు కలెక్టర్ నైపుణ్య శిక్షణ కార్యక్రమాల అమలుకు పక్కా ప్రణాళిక రూపొందించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ అన్నారు. మంగళవారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఉపాధి అధికారి కార్యాలయం ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన స్కిల్ అక్విజిషన్ అండ్ నాలెడ్జ్ అవేర్నెస్ ఫర్ లైవ్లిహుడ్ ప్రమోషన్ (సంకల్ప్) కార్యక్రమంపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. సంకల్ప్ కార్యక్రమ అమలుకు తీసుకోవాల్సిన కార్యాచరణపై అధికారులతో అదనపు కలెక్టర్ చర్చించి, పలు సూచనలు చేశారు. కెరియర్ కౌన్సిల్ సెల్, ప్రతి కళాశాలలో నైపుణ్య శిక్షణ, స్కిల్స్ సెల్, స్కిల్ డెవలప్మెంట్ గురించి సుదీర్ఘంగా చర్చించారు.
ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వివిధ శాఖల ద్వారా నైపుణ్య అభివృద్ధి, స్కిల్ డెవలప్మెంట్ క్రింద చేపట్టే కార్యక్రమాలను సమన్వయంతో నిర్వహించాలని అన్నారు. ప్రభుత్వం అమలు చేసే వివిధ పథకాలను సమన్వయం చేసుకుంటూ శిక్షణ నుంచి చిన్న వ్యాపారం ప్రారంభించే వరకు అవసరమైన సహాయ, సహకారాలను అందించేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు. యువతకు ప్రస్తుత ట్రెండ్, డిమాండ్ ప్రకారం అవసరమైన కోర్సులలో శిక్షణ అందించేందుకు ప్రణాళికలు తయారు చేయాలని అన్నారు. యువతకు అందించే కోర్సుల వివరాలు, అర్హత, వసతి అంశాలను పూర్తిగా ప్లాన్ చేసుకోవాలని అన్నారు. జిల్లాలో ఉన్న వివిధ వర్గాల రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లో సమ్మర్ సమయంలో నెల రోజుల పాటు ప్రత్యేక ప్రొగ్రాం క్రింద వివిధ కోర్సులలో శిక్షణ ఏర్పాటు చేయాలని అన్నారు. భవన నిర్మాణ కార్మికులకు స్కిల్ అప్ గ్రెడేషన్, వారి వారసులకు కెరియర్ గైడెన్స్ చర్యలు తీసుకోవాలని అన్నారు. ఐటీడీఏ ద్వారా శిక్షణా కార్యక్రమాలు, టీ- ఐడియా, టి – ప్రైడ్, పీఎం విశ్వకర్మ, పిఎంఎఫ్ఎంఈ, ఉపాథి కల్పన మొదలగు వివిధ కార్యక్రమాల వినియోగిస్తూ నైపుణ్య శిక్షణ కార్యక్రమాల అమలుకు చర్యలుచేపట్టాలని, సంపూర్ణ అవగాహనతో విస్తృత ప్రచారం కల్పించాలని అన్నారు. రైతు వేదికలను వినియోగిస్తూ ఆధునిక సాగు పద్ధతులు, వివిధ పంటలు, హార్టికల్చర్, వ్యవసాయ అధికారి పరీక్షలపై అవగాహన కల్పన కార్యక్రమాలకు చర్యలు చేపట్టాలని అన్నారు. అధికంగా పంట పండిస్తున్న రైతుల సాగు పద్ధతులు అనుభవాలను ఇతరులకు తెలిసేలా చూడాలని అన్నారు. డి మార్ట్ వంటి వాణిజ్య కార్యకలాపాలకు వినియోగపడేలా కూరగాయల పెంపకం, పూల మొక్కల పెంపకం ప్రోత్సహించాలని అన్నారు.‌ జిల్లాలో వివిధ శాఖల క్రింద చేపట్టే నైపుణ్య శిక్షణ కార్యక్రమాలపై ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేయాలని సోమవారం మరోసారి సమావేశం నిర్వహించడం జరుగుతుందని అదనపు కలెక్టర్ అన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఉపాధి అధికారిణి ఎన్. మాధవి, జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి కె. సత్యనారాయణ, జిల్లా బీసీ సంక్షేమ అధికారి జి. జ్యోతి, ఎస్సి కార్పొరేషన్ ఈ.డి. నవీన్ బాబు, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి పురంధర్, మహిళా ప్రాంగణం జిల్లా మేనేజర్ వి. విజేత, జిల్లా పరిశ్రమల అధికారి సీతారాం, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ జి. సుజాత, ఐ.టి.ఐ. ప్రిన్సిపాల్ ఏ. శ్రీనివాస రావు, వ్యవసాయ, కార్మిక శాఖ, ఎస్టీ వెల్ఫేర్, డి.ఆర్.డి.ఓ కార్యాలయ, బ్యాంక్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments