
: వీధిన పడ్డ జే.కే 5 ఓ.సి నిర్వాసిత కుటుంబం
పయనించే సూర్యుడు ఆగస్టు 26 (పొనకంటి ఉపేందర్ రావు )
ఇల్లందు:: ప్యాకేజీ ఇచ్చి ఇంటి స్థలం మరిచిన సింగరేణి నాటి నుంచి నేటి వరకు మొరపెట్టుకుంటున్న నిర్వాసిత కుటుంబం నాడు జరిగిన అవకతవకల్లో బ్రోకర్లు కొట్టేశారా : విచారణ జరిపి న్యాయం చేయాలి సింగరేణి అలసత్వానికి ఓ కుటుంబం పదమూడేళ్లుగా గూడు లేక అల్లాడిపోతుంది జెకె 5 ఓపెన్ కాస్ట్ లో నాడు ఇల్లు వాకిలి కోల్పోయి రోడ్డు న పడ్డాడు నాటినుండి నేటి వరకు అధికారుల వద్దకు కాళ్లు చెప్పులు అరిగేలా తిరిగిన ఫలితం దొరకడం లేదు చివరకు ఆత్మహత్య శరణ్యమని భార్య పిల్లలతో కలిసి ఆత్మహత్యకు ప్రయత్నించగా విషయం తెలిసిన సోషల్ సర్వీస్ చేస్తున్న ముజాయిద్ వారికి నచ్చజెప్పి సోమవారం జిల్లా కలెక్టర్ వద్దకు కుటుంబ సభ్యులందరినీ తీసుకొని వెళ్లి సమస్యను వివరించారు వివరాల్లోకి వెళితే మేకల ఓంకార్ తండ్రి కృష్ణమూర్తి మంతిని ఫైల్ బస్తి లో నివాసం 13 సంవత్సరాల క్రితం జెకె ఓసి ఉపరితల గనిలో తన ఇల్లును కోల్పోయాడు సింగరేణి సర్వేనెంబర్ ఏ బ్లాక్ 636 గా సర్వే నిర్వహించారు నష్టపరిహారంగా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని అందజేసిన అధికారులు ఇంటి స్థలం మాత్రం ఇవ్వలేదు నాటినుండి ఇంటి స్థలం కోసం తిరుగుతూనే ఉన్నారు అయినప్పటికీ సింగరేణి అధికారులు ఆర్డిఓ ఆ కుటుంబానికి జరిగిన అన్యాయంపై విచారణ నిర్వహించి న్యాయం చేయలేకపోయారు తన ఇంటి స్థలం ఇవ్వడంలో ఎక్కడ పొరపాటు జరిగిందో అర్థం కాకపోవడంతో ఆనాడు నిర్వాసిత ప్రాంతంలో జరిగిన అవకతవకల కారణంగా తన స్థలాన్ని మరె వరైనా కాజేసారా అనే అనుమానం వ్యక్తం చేశారు దివ్యాంగుడైన ఓంకార్ భార్య ఇద్దరు ఆడపిల్లలతో అద్దె ఇంట్లో ఉంటున్నారు. అద్దె కట్టలేక కుటుంబం గడవక చావే శరణ్యమని భావించిన ఆ కుటుంబానికి అండగా మరో దివ్యాంగుడు ముజాయిద్ అండగా ఉండి తన ఆటోలో కొత్తగూడెం కలెక్టర్ వద్దకు తీసుకొని వెళ్లి సమస్యను లేవనెత్తి పరిష్కారం దిశగా చేస్తున్నారు.ఇప్పటికైనా సింగరేణి అధికారులు పూర్తిస్థాయి విచారణ నిర్వహించి ఓంకార్ కుటుంబానికి న్యాయం చేస్తే రెండో విడత ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తు చేసుకొని ఓ గూడు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది.