
ఎంఈవో తో మాట్లాడుతున్న బోధన్ సబ్ కలెక్టర్..
రుద్రూర్, మార్చ్ 24 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) : రుద్రూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కొనసాగుతున్న పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని సోమవారం బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో అకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షా కేంద్రంలో ఏర్పాట్లను పరిశీలించారు. మాస్ కాపింయింగ్ కు పాల్పడకుండా చూడాలని ఉపాధ్యాయులకు వివరించారు. విద్యార్థుల సంఖ్య, హాజరు, గైర్హాజరు అయిన వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఆయన వెంట ఎంఈఓ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.