
విద్యార్ధినీల ఫొటోలు..
రుద్రూర్, ఏప్రిల్ 30 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) :
రుద్రూర్ మండల కేంద్రంలో గల కేజీబీవీ పాఠశాలలో చదివే విద్యార్ధినీలు బుధవారం విడుదలైన పరీక్ష ఫలితాలలో 40 మంది విద్యార్థులకు గాను 40 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 100 శాతం ఉత్తీర్ణత సాధించి ప్రభంజనం చాటారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినీలు జి. శివాని-577, ఎం. మధుశ్రీ – 559, జి.శృతి – 565, ఐ. వీక్షిత – 554, ఎం. భార్గవి – 552 పదవ తరగతి పరీక్ష ఫలితాలలో మార్కులు సాధించి పాఠశాలకు, గ్రామానికి పేరు ప్రతిష్టలు తీసుకువచ్చినందుకు విద్యార్థినీలను అభినందించారు.