
పయనించే సూర్యుడు. మే 01. ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఏన్కూరు
తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఏప్రిల్ 30 నా విడుదల చేసిన పదవ తరగతి పరీక్ష ఫలితాలలో ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల మూలపోచారం విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. నూరు శాతం సాధించిన విద్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి. నాగరాజు, డిప్యూటీ వార్డెన్ బి.రవి, సీనియర్ ఉపాధ్యాయులు డిఎస్. నాగేశ్వర రావు మరియు ఉపాధ్యాయ సిబ్బంది అభినందించారు. పాఠశాల నుండి పదవ తరగతి విద్యార్థులు ఆరుగురు పరీక్షలు రాయగా ఆరుగురు కి ఆరుగురు విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి నూరు శాతం ఫలితాలు సాధించారు.ఖమ్మం జిల్లాలోని పది ఆశ్రమ పాఠశాలల్లో నూరు శాతం ఫలితాలు సాధించి అగ్రగామిగా నిలబడింది. ఆశ్రమ ఉన్నత పాఠశాల మూలపోచారం నూరు శాతం ఫలితాలు సాధించిన ప్రధానోపాధ్యాయులను మరియు ఉపాధ్యాయ సిబ్బందిని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎన్.విజయలక్ష్మి, గిరిజన సంక్షేమ శాఖ సహాయ అభివృద్ధి అధికారి షేక్.జహీరుద్దీన్,మండల విద్యాశాఖాధికారిని రహీమ్ బీ, ఏ.సి.యం.ఓ ఎల్.రాములు అభినందించారు.నూరు శాతం ఫలితాల సాధనకు మాకు వెన్నుదన్నుగా ఉంటూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ ముందుకు నడిపినటువంటి గిరిజన సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ ఆఫీసర్ బి.రాహుల్ ఐఏఎస్, డిప్యూటీ డైరెక్టర్ విజయలక్ష్మి,ఏటిడిఓ.షేక్ జహీరుద్దీన్,ఏ.సి.యం.ఓ యల్.రాములులకు కృతజ్ఞతలు తెలిపారు.విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయ సిబ్బందికి అభినందనలు తెలియజేశారు.
