
షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
ధన్వంతరి గ్రామీణ వైద్యుల సమావేశానికి ముఖ్య అతిథి గా హాజరైన ఎమ్మెల్యే
( పయనించే సూర్యుడు ఏప్రిల్ 11 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్)
ఆర్ఎంపీ లు ఎట్టి పరిస్థితుల్లో పరిధి దాటి వైద్యం చేయవద్దని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కోరారు. ఈ ధన్వంతరి గ్రామీణ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో సంఘ భవనంలో నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… అర్ంపిలు ఎట్టి పరిస్థితుల్లో పరిధి దాటి వైద్యం చేయవద్దని కోరారు.గ్రామాల్లో అందుబాటులో ఉండి అత్యవసర సమయాల్లో వైద్యం చేస్తున్న అర్ంపిలపై గ్రామాల్లో మంచి నమ్మకం ఉందని,ఆ నమ్మకాన్ని పరిధి దాటి వైద్యం చేసి పోగొట్టుకోవద్దని కోరారు. అత్యవసర పరిస్థితుల్లో రోగిని ప్రభుత్వ, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు రిఫర్ చేయాలని కోరారు.కానీ డబ్బులకు ఆశపడి రిస్క్ తో కూడిన వైద్యం మాత్రం అందించవద్దని తెలిపారు. గతంలో జరిగిన ఉదంతాలు పునరావృతం కాకుండా జాగ్రత పడాలని కోరారు. అతి త్వరలో ఇండియన్ మెడికల్ కౌన్సిల్ వైద్యులతో ధన్వంతరి గ్రామీణ వైద్యుల బృందంతో ఉమ్మడి సమావేశం నిర్వహిస్తానని తెలిపారు. ధన్వంతరి గ్రామీణ వైద్యులు ప్రభుత్వ నియమనిబంధనల ప్రకారం నడుచుకోవాలని కోరారు అలాగే ప్రభుత్వ అధికారులు, డిఏంహెచ్ఓ ల యొక్క ఆదేశాలను తూచ తప్పకుండా పాటించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ధన్వంతరి గ్రామీణ వైద్యుల సంఘ నాయకులు,గ్రామీణ వైద్యులు తదితరులు పాల్గొన్నారు.