
పయనించే సూర్యుడు సెప్టెంబర్ 10( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు)
సూళ్లూరుపేట పురపాలక సంఘం కార్యాలయంలో ఈరోజు అనగా బుధవారం 10.09.2025న అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్, సూళ్లూరుపేట వారిచే సూళ్లూరుపేట పురపాలక సంఘంలో పనిచేయుచున్న పరిశుధ్య కార్మికులకు ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో దాదాపు 150 మున్సిపల్ సిబ్బంది ఉచితముగా కంటి వైద్య పరీక్షలు సద్వినియోగం చేసుకున్నారు. ఈ కార్యక్రమం నిర్వహించిన అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్, సూళ్లూరుపేట వారికి మరియు వారి సిబ్బందికి సూళ్లూరుపేట పురపాలక సంఘం మున్సిపల్ కమిషనర్ కె. చిన్నయ్య కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ (I/C) ఎ.వెంకటేశ్వర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొనడం జరిగినది.


