
తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (టిజీ ఎండీసీ)పని తీరుపై సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే
ఈరోజు శాసనసభ కమిటీ హాల్ లో ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్,షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గారు రాష్ట్ర ఖనిజాభివృది సంస్థ పనితీరుపై సమీక్ష సమావేశం ను నిర్వహించారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులైన జహీరాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి,జుక్కల్ ఎమ్మెల్యే శ్రీ లక్ష్మీ కాంతారావు, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మరియు శాసనసభ కార్యదర్శి డాక్టర్ నరసింహాచార్యులు ఇతర సిబ్బంది తోపాటు రాష్ట్ర ఖనిజాభివృది సంస్థ సెక్రటరీ శ్రీ ఎన్ శ్రీధర్ , తెలంగాణా రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ సుశీల్ ఇతర సిబ్బందితోపాటు తెలంగాణ ఆడిట్ జనరల్ మాధవి గారు పాల్గొన్నారు. ఈ సమావేశంలో తెలంగాణా రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. ఈ సందర్భంగా చైర్మన్ వీర్లపల్లి శంకర్ గారు మాట్లాడుతూ…రాష్ట్ర ఖనిజ సంపదను అందరికీ అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.పర్యవేషణ లోపంతో గతంలో ఇసుక,మైనింగ్ అక్రమ తవ్వకాల వల్ల ప్రభుత్వ ఆదాయానికి నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు.గత ప్రభుత్వం రాష్ట్ర వనరులను సామాన్యునికి అందకుండా చేసి కొందరి ఆదాయమును పెంచిందని తెలిపారు.రాష్ట్ర ముఖ్య మంత్రి గారి ఆదేశానుసారం దళారీ వ్యవస్థను నిర్మూలించి ఇసుకను సామాన్యునికి అందేటట్లు రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ కృషి చేయటం అభినందనీయం అని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇండ్లు కట్టే ప్రతి పేదవాడికి ఇసుకను ఉచితంగా అందించాలానే లక్ష్యంతో ప్రస్తుత ప్రభుత్వం పని చేస్తుంది అన్నారు. సంస్థ ద్వారా రాష్ట్ర ఆదాయాన్ని పెంచే మార్గాలను అన్వేషించాలని కోరారు.
