
డెడ్ లిఫ్ట్ 170 కిలోల జూనియర్ విభాగంలో గెలుపొందిన కర్నే కోట రిషి పవన్
అభినందించిన కరాటే మాస్టర్ మరియు కోచ్
( పయనించే సూర్యుడు ఆగస్టు 04 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని ఎస్సార్ కి ఫిట్నెస్ క్లబ్ ఆధ్వర్యంలో డబ్ల్యూ పి సి తెలంగాణ ఓపెన్ డిస్టిక్ చాంపియన్షిప్ 2025 పోటీలు ఘనంగా జరిగాయి. ఈ పోటీల్లో షాద్నగర్ కు చెందిన కర్నే కోట రిషి పవన్ పాల్గొని ఉత్తమ ప్రతిభను కనబరిచాడు. డెడ్ లిఫ్ట్ 170 కిలోల జూనియర్ విభాగంలో 20 నుంచి 23 క్యాటగిరిలో గెలుపొందడం జరిగింది. కరాటే లో బ్లాక్ బెల్ట్ అయిన రిషి పవన్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లోను గెలుపొందడంతో తల్లిదండ్రులు స్థానికులు అభినందించారు. అనంతరం ఎస్ ఆర్ కే ఫిట్నెస్ క్లబ్ సీఈఓ షారుక్ ఖాన్ మరియు యాదవ్ బుడోఖాన్ కరాటే క్లబ్ ఇంటర్నేషనల్ డిప్యూటీ గ్రాండ్ మాస్టర్ సాయినాథ్ యాదవ్ రిషి పవన్ కు ప్రత్యేకంగా అభినందించారు.
