
పయనించే సూర్యుడు న్యూస్ నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీనివాస్ 24 తేదీ ఏప్రిల్
వాకిటి ఆంజనేయులు జ్యోతిరావు పూలే బీసీ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు
పహాల్గాం లో జరిగిన ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండించి దాడిలో మరణించిన వారికి కొవ్వొత్తుల ప్రదర్శనతో నివాళులర్పించడం జరిగింది. అధ్యక్షులు మాట్లాడుతూ ” ఇలాంటి కుటిల నీతితో అంతర్గత భద్రతను భంగం కలిగించడానికి ఎంత ప్రయత్నం చేసినా అది ఎప్పటికీ నెరవేరదు ప్రపంచ దేశాల కంటే ఉన్నతమైన దేశం భారతదేశం ఇక్కడ విభిన్న మతాలకు అతీతంగా కలిసిమెలిసి నివసించే దేశం. ఈ దేశాన్ని ఉగ్రవాదంతో విడగొట్టే ప్రయత్నం చేస్తే పుట్టిన పిల్లవాడు కూడా ఊరుకోడు” అని అన్నారు. ఈ సందర్భంగా ఈసరి శ్రవణ్ కుమార్ మహాత్మ జ్యోతిరావు పూలే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు మాట్లాడుతూ” ప్రత్యక్షంగా ఎదుర్కోలేని పిరికిపందలు భారతదేశ సమైక్యతను భంగం కలిగించడానికి, కుల మతాలను రెచ్చగొట్టడానికి చేసినటువంటి ఈ ఉగ్రదాడిని అందరూ తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. ఈ దాడిలో ఎంతటి వారైనా వారిని కఠినంగా శిక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.