
విఎన్ఆర్ విజ్ఞాన్ కాలేజ్ స్టూడెంట్ ఫోర్ మరియు ప్రగతి ప్రగతి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో పంపిణీ
( పయనించే సూర్యుడు అక్టోబర్ 11 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)
రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండలంలోని బూర్గుల ప్రాథమిక పాఠశాలలో విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన స్టూడెంట్ ఫోర్స్ అనే సంస్థ వారు ప్రగతి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో విద్యార్థులందరికీ 265, నోట్ పుస్తకాల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్టూడెంట్ ఫోర్స్ కు చెందిన పదిమంది ఇంజనీరింగ్ విద్యార్థులు, ప్రగతి వెల్ఫేర్ సొసైటీ సభ్యులు సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్ మురళి కృష్ణ, ప్రగతి, లావణ్య, తులసి, శ్రీకాంత్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి ప్రీతి బాల , అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ సుజాత గారు, విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది.ఇవ్వబడిన పుస్తకాలను కళాశాలలో విద్యార్థులు రాసిన రికార్డ్ పేపరు ద్వారా రీసైక్లింగ్ ప్రాసెస్ చేసి తయారు చేయబడినవి. దాని ప్రాముఖ్యతను తెలియజేస్తూ రెడ్యూస్ – రీయూస్ – రీసైకిల్ (ఆర్ ఆర్ ఆర్) గురించి సంస్థ విద్యార్థులు పాఠశాల విద్యార్థులకు అవగాహన కలిగించడం జరిగింది. ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు చెడు స్పర్శ మంచి స్పర్శ పైన అవగాహన కలిగిస్తూ బూర్గుల జిల్లా పరిషత్ పాఠశాల 9 మరియు 10వ తరగతి విద్యార్థులకు కెరియర్ గైడెన్స్ పైన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందుకు గాను ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు ప్రతి బాల మరియు బూర్గుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రవికుమార్ సంతోషాన్ని వ్యక్తపరిచారు.
