
పయనించే సూర్యుడు మే 21 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
ఆత్మకూరు నియోజకవర్గం చేజర్ల మండల సాక్షి పాత్రికేయుడు రవీంద్రబాబు అనారోగ్య కారణాలతో మృతి చెందడంతో ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి తన సంతాపాన్ని తెలిపి మృతుని కుటుంబానికి రూ.50వేలు ఆర్థిక సహాయం మంగళవారం అందచేశారు. రవీంద్రబాబు మృతి చాలా బాధాకరమని, ఎన్నో సంవత్సరాలుగా పాత్రికేయునిగా ఆయన సేవలందించారన్నారు. రూ.50వేలు ఆర్థిక సహాయాన్ని చేజర్ల వైఎస్సార్సీపీ నాయకుల ద్వారా పాత్రికేయుడు రవీంద్రబాబు కుటుంబసభ్యులకు అందచేశారు మండల వైఎస్ఆర్సిపి నాయకులు బాలిరెడ్డి సుధాకర్ రెడ్డి. శేఖర్ రెడ్డి. నాయకులు పాల్గొన్నారు