
పయనించే సూర్యుడు ఫిబ్రవరి 12, కాకినాడ జిల్లా ప్రతినిధి కాకినాడ రూరల్ (బి వి బి) స్థానిక రమణయ్యపేట లో జరిగిన కార్యక్రమం లో డా అడ్డాల సత్యనారాయణ మాట్లాడుతూ”మన కాకినాడ నగర అభివృద్ధి కి రాజ్యసభ ఎమ్ పి సానా సతీష్ బాబు ప్రస్తావన తేవడం ఆనందకరం అని అన్నారు.కాకినాడ కి షిప్పింగ్ హార్బర్ పోర్ట్ ,ఉప్పాడ రోడ్డు మరమ్మతులు,మరియు అన్నవరం దేవస్థానం అభివృద్ధి కి నిధులు మంజూరు చేయమని అడగటం అభినందనీయమని అన్నారు. మనల్ని కన్న వాళ్ళకి,పెరిగిన సొంత ఊరికి ఏదో మేలు చేయాలన్న ఆలోచన అందరికీ ఉండాలని, నా చిన్ననాటి మిత్రుడు సానా సతీష్ బాబు రాజ్యసభ ఎమ్ పి హోదా లో మన కాకినాడ జిల్ల మరియు తూర్పు గోదావరి జిల్లా కి పర్యటక గుర్తింపు కోసం కృషి చాయాలని ఆకాంక్షించారు.ప్రముఖ అనస్థీసియా వైద్య నిపుణులు ఆల్ ఈస్ వెల్ సభ్యులు డా రాజ్ కుమార్ మాట్లాడుతూ”మన కాకినాడ కి చాలా కాలం తరువాత ఇద్దరు ఎమ్ పీ లు ఉండటం ఆనందకరమైన విషయం అని, కాకినాడ ని హరిత నగరం గామార్చడంలోసహకరించాలని అన్నారు. మన కాకినాడ ని సుందర నగరం గా చేసుకోవడానికి ప్రజలందరూ సహకరించాలని కోరారు.