
//పయనించే సూర్యుడు// న్యూస్// నారాయణపేట జిల్లా ఫిబ్రవరి 22 ఫిబ్రవరి 2న జరిగిన పూసలపాడు టాలెంట్ టెస్ట్ ఫలితాలను జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజులు శనివారం జిల్లా కేంద్రంలో విడుదల చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు విభాగంలో టాప్ 10 మంది విద్యార్థుల పేర్లను ప్రకటించారు. ఈ సందర్భంగా డీఈఓ గోవిందరాజులు మాట్లాడుతూ పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించుట కోసం ఇలాంటి ప్రతిభా పరీక్షలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. ఇట్టి ప్రతిభ పరీక్షను జిల్లావ్యాప్తంగా 120 పాఠశాలల నుండి 3750 మంది విద్యార్థులు పరీక్ష రాసినట్లు నిర్వాహకులు షేర్ కృష్ణారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఏంఓ విద్యాసాగర్, సేక్టోరియల్ అధికారులు నాగర్జున రెడ్డి, నర్మద, శ్రీనివాస్, మండల విద్యాశాఖ అధికారి బాలాజీ సూపరింటెండెంట్ నరసింహారెడ్డి సీనియర్ అసిస్టెంట్ ఉదయభాను, జిల్లా సైన్స్ అధికారి భాను ప్రకాష్, తపస్ నాయకులు బాలరాజ్, నరసింహ, సీతారాములు, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.