
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో
1200 వందల పైగా విద్యార్థులత పిడిఎస్ ర్యాలీ ఆర్డీవో కి వినతి
స్కాలర్షిప్ విడుదల చేయకపోతే ఉద్యమలు పెద్ద చేస్తారు పి డి ఎస్ యు
పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్, రియంబర్స్మెంట్లను విడుదల చేయాలని పి డి ఎస్ యు పిడిఎస్యు ఏరియా కమిటీ ఆధ్వర్యంలో వందలాదిమంది విద్యార్థులతో ఆర్మూర్ బస్టాండ్ నుండి ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి ఆర్డిఓ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా పి డి ఎస్ యు అధ్యక్షులు ఎం,నరేందర్. జిల్లా ఉపాధ్యక్షులు అనిల్ కుమార్ లు మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా గత ప్రభుత్వం మరియు కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తు ఆలోచించకుండా వారికి రావాల్సినటువంటి బకాయిలను స్కాలర్షిప్, రియంబర్స్మెంట్, లను పెండింగ్లో ఉంచాయి.
దాదాపు 7వేల కోట్ల రూపాయల వరకు బకాయిలు పెండింగ్లో ఉంచి విద్యార్థులకు తీవ్రమైన నష్టాన్ని కలగజేస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను విడుదల చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చి నేడు హామీని మర్చిపోయారు, విద్యార్థుల పక్షాన ఆలోచించకుండా నేటికీ రెండు సంవత్సరాలు గడుస్తున్న విద్యాశాఖ ను ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోనే ఉంచుకొని విద్యాశాఖ మంత్రి నియమించకపోవడం సిగ్గుచేటు. ప్రభుత్వ కళాశాల ,పాఠశాలలు బలోపేతం చేస్తామని చెప్పి కనీస మౌలిక వసతులను కూడా ఏర్పరచకుండా రాష్ట్రంలో విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు. ప్రైవేట్ కాలేజ్ ల యజమాన్యాలు స్కాలర్షిప్ ఇవ్వకపోతే కళాశాలలు మూసివేస్తామని ,అనేకసార్లు ప్రకటించిన ,మూసివేసిన ప్రభుత్వం చొరవ చూపలేదు, యూనివర్సిటీ పరిధిలో అనేక సెమిస్టర్లు వాయిదా పడ్డవి చాలా ఆలస్యంగా జరిగినవి. విద్యార్థులను అయోమయంలోని వెళ్లేలా ప్రభుత్వం వారితో ఆటలాడుతుంది. ఈ విధానాన్ని తప్పుపడుతూ పెండింగ్ లో ఉన్న అన్ని బకాయిలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, అందుకే ఈరోజు పెద్ద ఎత్తున ర్యాలీగా వచ్చి మా నిరసన ను తెలియజేశామని వారు అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం విద్యారంగ సమస్యలను పట్టించుకోని వారికి రావాల్సిన బకాయిలను విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు పెద్ద ఎత్తున నిర్మిస్తామని ప్రతి జిల్లాలోని కలెక్టర్ ఆఫీస్ ల ముందు వేలాది మంది విద్యార్థులతో నిరసనలతో కార్యక్రమాలు చేపడతామని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఏరియా పిడిఎస్యు అధ్యక్షులు నిఖిల్, ప్రధాన కార్యదర్శి మమత, నాయకులు బాల కృష్ణ రాము, వివేక్ , విద్యార్థిని, విద్యార్థులు ,తదితరులు పాల్గొన్నారు
