
పయనించే సూర్యుడు మే 4 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి
యాడికి మండలం కమలపాడు రోడ్డు రాఘవేంద్ర కాలనీలో ఉన్న అగాపే ఆశ్రమంలో జానపాటి శ్రీనివాసులు (ప్రెస్), భార్య శ్రీదేవి వారి 29వ పెళ్లిరోజు శుభ సందర్భంగా వారి వంతుగా సహాయం చేయాలని అగాపే ఆశ్రమంలోని నిరాశ్రయులకు ఉదయకాలము టిఫిను, మధ్యాహ్నం భోజనము సిద్దపరచి కుటుంబమంతా కలిసి ఆశ్రమంలోని వారికి అన్నదానం చేశారు.వారి కుమార్తెలు వర్షశ్రీ, త్రిష శ్రీ, కుమారుడు వెంకట సాయి మోక్షిత్,కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.ఇందు నిమిత్తమై ఆశ్రమ పౌండర్ బత్తల ప్రసాద్, ఆశ్రమంలోని వారంతా వారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసి వారి కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు.
