
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ జూలై 11 అల్లూరి సీతారామరాజు జిల్లా
చింతూరు మండలం చట్టి గ్రామ పంచాయతీలో ఎన్నో సంవత్సరాలుగా ఖాళీగా ఉన్నటువంటి ఆశా వర్కర్ నియామకాన్ని చేపట్టాలని ఆరోగ్య శాఖ పాడేరు వారు నోటిఫికేషన్ ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించి చట్టి “పెసా” కమిటీ సభ్యులు ఉపాధ్యక్షులు తుర్రం. చిన్న ముత్తయ్య. కార్యదర్శి పొడియం. రామకృష్ణ చింతూరు డివిజన్ ఆరోగ్యశాఖ డిప్యూటీ DMHO గారిని కలిసి గ్రామంలో ఉన్నటువంటి ఆశా వర్కర్ నియామకాన్ని “పెసా” గ్రామసభ ద్వారా జరగాలంటూ వినతిపత్రం ఇవ్వడం జరిగింది. దానికి వారు సానుకూలంగా స్పందిస్తూ గ్రామాలలో ఏర్పాటుచేసిన శానిటేషన్ కమిటీ సభ్యులు మరియు “పెసా” కమిటీ సభ్యులు ద్వారా గ్రామసభలో ఆశా వర్కర్ ఎన్నిక చేసుకోవచ్చని తెలియజేయడం జరిగింది.